Banana Tips: అరటి పండ్లు పాడవకుండా, ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి
అరటి పండ్లను ఒకదాన్నించి మరొకటి, ఇతర పండ్ల నుంచి దూరంగా పెట్టాలి.
పచ్చి అరటి పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే నెమ్మదిగా పండుతాయి.
అరటి పండ్లను హ్యాంగింగ్ చేసి ఉంచడం వల్ల అవి త్వరగా పాడవకుండా ఉండాయి.
అరటి పండ్లు మగ్గిన తరువాత వాటి లైఫ్ పెంచేందుకు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. అరటి పండ్లు త్వరగా పండకుండా ఉండాలంటే అరటి గుచ్చాన్ని ప్లాస్టిక్ ర్యాప్ లేదా సంచితో కప్పేయాలి.
అరటి పండు తొక్కలపై నిమ్మరసం రాయడం వల్ల త్వరగా పండిపోకుండా ఉంటాయి. అరటి పండ్లను స్మూదీ లేదా బేకింగ్ కోసం వినియోగించేదైతే అరటి పండ్లను ఒలిచి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు.