Rakhi Poornima Bank Holiday: సోమవారం 19 రాఖీపూర్ణిమ.. బ్యాంకులకు సెలవు ఉందా? మీరూ తెలుసుకోండి..
Rakhi Poornima Bank Holiday 2024: రాఖీపూర్ణిమ అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక. ప్రతి ఏడాది శ్రావణ మాసం పూర్ణిమ రోజు రాఖీ పండుగను నిర్వహిస్తారు. అయితే, ఈ ఏడాది సోమవారం ఆగష్టు 19వ తేదీ రాఖీ పండుగను జరుపుకొంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజున బ్యాంకులు పనిచేస్తాయా? లేదా? తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రాఖీ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు పాటించనున్నారు. ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేటు బ్యాంకులు సెలవుదినంగా పాటించనున్నాయి. ఎందుకంటే ఆర్‌బీఐ బ్యాంక్ క్యాలండర్ ప్రకారం కొన్ని ప్రత్యేక రోజుల్లో బ్యాంకులు పనిచేయవు.
అందుకే ఈ ప్రత్యేక రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయో లేదో అనేది ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే ఇబ్బందులు పడకుండా ఉంటారు. అయితే అన్ని బ్యాంకులకు సోమవారం బ్యాంకులకు సెలవు. ఆగష్టు 15న కూడా బ్యాంకులకు సెలవు ఉన్న సంగతి తెలిసిందే.
డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులు ముఖ్యంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ యథావిధిగా కొనసాగుతాయి. ఆర్‌బీఐ బ్యాంక్ క్యాలండర్ సెలవుల ప్రకారం ముందుగానే సెలవులు తెలుసుకోవచ్చు.
15 రోజుల్లో బ్యాంకుల్లో ఆరు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఆగష్టు 18 ఆదివారం, 19న సోమవారం రాఖీపూర్ణిమ సందర్భంగా బ్యాంకులకు సెలవు, అంతేకాదు ఈరోజు వీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జన్మదినం సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఆగష్టు 20న గురు జయంతి సందర్భంగా కేరళలో బ్యాంకులకు సెలవు.
ఇక ఆగష్టు 24న నాలుగో శనివారం, 25 ఆదివారం, 26 జన్మాష్టమి రోజున కూడా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.