Krishnashtami Bank Holiday: కృష్ణాష్టమి బ్యాంకులకు సెలవు ఉంటుందా? పనిచేస్తాయా? ముందుగానే తెలుసుకోండి..
కృష్ణుడు అంటేనే విష్ణుమూర్తి ఎనిమిదో అవతారంగా పరిగణిస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం ఈరోజు కృష్ణ పూజ చేస్తారు. ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 26 సోమవారం రోజు రానుంది.అయితే బ్యాంకు పని ఉన్నవాళ్లు కృష్ణాష్టమి రోజు బ్యాంకులు సెలవు దినం ఉంటుందా? పని దినమా? అని సందేహంలో ఉన్నారు అయితే కేవలం కొన్ని ప్రాంతాల్లోనే బ్యాంకులకు సెలవు దినాలుగా పరిగణించారు.
ఈ ప్రాంతాల్లో అన్ని పబ్లిక్ ప్రైవేట్ బ్యాంకులకు ఆరోజు సెలవు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం సోమవారం బ్యాంకులకు సెలవు ఎక్కడెక్కడ ఉందో తెలుసుకుందాం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ,ఒడిశా, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్ జమ్మూ, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్ చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ శ్రీనగర్ ఈ రాష్ట్రాల్లో కృష్ణాష్టమి సందర్భంగా సెలవు దినాలుగా పరిగణించారు.
ఏవైనా పనులు ఉంటే ఈరోజు లేదా రేపటిలోగా బ్యాంకు పనులు ముగించుకోవాలి లేకపోతే వరుసగా రే రెండు రోజులు ఆదివారం, సోమవారం కృష్ణాష్టమి కాబట్టి రెండు రోజులు బ్యాంకు సెలవు దినాలు. శ్రావణ మాసం కృష్ణపక్షంలో జన్మాష్టమి వేడుకలు అష్టమి రోజు జరుపుకుంటారు. ఇది ప్రతి ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ లో వస్తుంది.
విష్ణుమూర్తి ఎనిమిదో అవతారం కృష్ణుడి రూపంలో ఇదే ప్రపంచాన్ని పరిపాలించారు. కృష్ణుడు దేవకి వసుదేవులకు మాదిరి ఉత్తర ప్రదేశ్ లో జన్మించారు. ఈరోజు కృష్ణుని పాదాలు వేయడం సాంప్రదాయాలు దుస్తులు ధరించడం కృష్ణుడు కోసం ఉపవాసాలు చేయడం వంటివి చేస్తారు. రంగురంగుల ముగ్గులు వేసి కృష్ణుడికి స్వాగతం పలుకుతారు.
ఈరోజు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. కృష్ణుడు రాత్రి సమయంలో పుట్టారు. కాబట్టి ఆ సమయంలోనే వేడుకలు జరుపుతారు. కృష్ణుడికి పాలు పెరుగు వంటివి సమర్పిస్తారు కీర్తనలు భజనలు చేస్తారు