Bank Holidays: రేపు బ్యాంకులకు సెలవు.. ఆర్‌బీఐ హాలిడే ప్రకటన, పూర్తి వివరాలు ఇవే..
బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలెర్ట్. ఈ ప్రాంతాల్లోని బ్యాంకులకు రేపు నవంబర్ 8వ తేదీ శుక్రవారం బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ముందుగానే వివరాలు తెలుసుకుని వెళ్లండి లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడతారు. ఆర్‌బీఐ మంజూరు చేసిన ఈ పెయిడ్ హాలిడే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
ఛత్ పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు రానుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఛత్ పూజను పరమ పవిత్రంగా నిర్వహిస్తారు. బీహార్, జార్ఖంఢ్, పూర్వాంచల్‌లో ఛత్ పూజ సందర్భంగా సూర్యుడిని పూజించే ఆచారం ఉంది.ఈ సందర్భంగా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉండనుంది.
ముఖ్యంగా బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జార్ఖంఢ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. ఈరోజు కుటుంబ సభ్యులతో భక్తిశ్రద్ధలతో ఛత్ పూజ జరుపుకుంటారు. అయితే ఈరోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది. కానీ, బ్యాంకు లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారా జరుపవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయి.
ఇదిలా ఉండగా రేపు 8వ తేదీ మేఘాలయాలో వంగల ఫెస్టివల్ జరుపుకుంటారు. దీన్ని గారో ట్రైబ్ వాళ్లు నిర్వహిస్తారు. దీన్ని 100 డ్రమ్స్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈరోజు మేఘాలయాలో కూడా బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. నవంబర్ 9 రెండో శనివారం ఆరోజు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు బంద్.
ఇక నవంబర్ 15 గురునానక్ జయంతి సందర్భంగా మిజోరాం, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిశా తోపాటు మరిన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. నవంబర్ 17 ఆదివారం, నవంబర్ 18 కర్నాటకలో కనకదాసు జయంతి సందర్భంగా ఆ ప్రాంతంలో బ్యాంకులు పనిచేయవు. నవంబర్ 23 నాలుగో శనివారం 24 ఆదివారం కూడా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంకులు బంద్