Bank holidays in October: వామ్మో..అక్టోబర్‎లో బ్యాంకులకు ఇన్ని సెలవులా ? జాబితా ఇదే

Mon, 16 Sep 2024-5:33 pm,

సెప్టెంబర్ నెల మాదిరిగానే..అక్టోబర్ నెలలో కూడా ప్రత్యేక రోజులు, పండగలు ఉన్నాయి. ఈనెల 12రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు చాలా రోజులు సెలవులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే బ్యాంకులు వరుసగా రెండు నుంచి మూడు రోజుల పాటు మూతబడిఉన్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడ్డాయి. వచ్చేనెల అక్టోబర్ నెలలో కూడా బ్యాంకులకు భారీగానే సెలవులు వచ్చాయి. ఈసారి అక్టోబర్ నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. మీకు అక్టోబర్ లో ఏదైనా బ్యాంకులో పనులు ఉంటే మాత్రం ముందే ప్లాన్  చేసుకోండి. ఎందుకంటే అక్టోబర్ పండగలు కూడా వస్తున్నాయి.ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండగ వస్తుంది. కాగా అక్టోబర్ లో ఏయే రోజు బ్యాంకు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.   

అక్టోబర్ నెలలో గాంధీ జయంతి, దసరా నవరాత్రులు, కర్వాచౌత్, ధన్తేరస్, దీపావళి మొదలైన పండగలు వస్తున్నాయి. పండగలు, ప్రత్యేక రోజులతో కలిపి ఈనెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉణ్నాయి. ఈ సెలవుల్లో రెండవ, నాలుగవ శనివారాలు ఉన్నాయి. ఇవే కాకుండా నెలలో నాలుగు ఆదివారాలు కూడా ఉన్నాయి. సెలవులతోపాటు నాలుగు ఆదివారాలను కలుపుకుంటే నెలలో 16రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ఈ లెక్కన చూస్తే బ్యాంకులు అక్టోబర్ నెలలో పనిచేసేది సగం రోజులే. 

అక్టోబర్ 2,2024 సోమవారం.. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 3, 2024 గురువారం..ఈరోజు నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి. మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 6 , 2024 ఆదివారం కావడంతో దేశ్యవాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.   

అక్టోబర్ 10, 2024 గురువాం..ఈ రోజు మహా సప్తమి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 11, 2024 శుక్రవారం నాడు.. మహా నవమి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.  అక్టోబర్ 12, 2024 శనివారం. ఆయుధ పూజ, దసరా, రెండవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.   

అక్టోబర్ 13, 2024 ఆదివారం. దేశవ్యాప్తంగా బ్యాంకులకు వారానికోసారి సెలవు. అక్టోబర్ 17, 2024 గురువారం.. కాటి బిహు సందర్భంగా అస్సాంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ రోజు కూడా ప్రగత్ దివస్ (వాల్మీకి జయంతి) కావడంతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు మూతపడి ఉంటాయి.   

అక్టోబర్ 20, 2024 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు  సెలవు ఉంటుంది. అక్టోబర్ 26, 2024.. శనివారం. విలీన దినం కారణంగా జమ్మూ కాశ్మీర్‌లోని బ్యాంకులు మూసివేయబడతాయి. నెలలో నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. 27 అక్టోబర్ 2024 ఆదివారం కావడంతో, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక నరక్ చతుర్దశి 31 అక్టోబర్ 2024, సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు, దీపావళి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link