Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..
ఎవైనా బ్యాంకు పనులు ఉంటే వెంటనే చూసుకోండి. ఎందుకంటే సెప్టెంబర్ మాసం ఎలాగో కేవలం 15 రోజులే బ్యాంకులు పనిచేయనున్నాయి అనే సంగతి తెలిసిందే. అందుకే ముందుగా వివరాలు తెలుసుకుంటే బ్యాంకులు పనులు పూర్తవుతాయి. ఏ ఇబ్బందులు పడకుండా ఉంటాయి.
సెప్టెంబర్ మాసంలో కేవలం సగం రోజులే బ్యాంకులు పనిచేయనున్నాయి. మొన్న వినాయక చవితిరోజు కూడా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆరోజు సెలవు దినంగా పరిగణించారు. అయితే, ఈ వారంలో మరో మూడు రోజులు కూడా బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. అందుకే ముందుగానే బ్యాంకు పనులు ఉంటే ముగించుకోండి.
అయితే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంకులు సెలవు దినాలను పాటిస్తాయి. ముఖ్యంగా కొన్ని పండుగలు, ప్రత్యేక రోజులు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతాయి. కానీ, ప్రతి నెలలో వచ్చే రెండో, నాలుగో శనివారాలు బ్యాంకు సెలవులు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి. అలాగే ఆదివారాలు ప్రత్యేకంగా చెప్పనసరం లేదు ఆరోజు కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవులు.
అసలు విషయానికి వస్తే ఈ మాసం సెప్టెంబర్ రెండోవారం చివరి శనివారం రెండో శనివారం. ఇది సెప్టెంబర్ 14న రానుంది. కాబట్టి ఆరోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు. ఆ మరుసటి రోజు 15 ఆదివారం ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు. ఇక 16వ తేదీ సోమవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఆరోజు కూడా బ్యాంకులకు సెలవులు రాన్నాయి.
ఈ విధంగా చూసుకుంటే ఈ వారం రెండో శనివారం నుంచి సోమవారం వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్ ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అంటే బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. రానున్న సెప్టెంబర్ 22 ఆదివారం, 28 నాలుగో శనివారం, 29వ తేదీ ఆదివారం కూడా బ్యాంకులకు సెలవులు రానున్నాయి.