Bathukamma 2024: నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ.. విశిష్టత ఏంటో తెలుసా?
తెలంగాణలో ఎంతో ప్రత్యేకమైన పూలపండుగ అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ పండుగ ముఖ్యంగా వానాకాలం వస్తుంది కాబట్టి రంగురంగుల పూలు పెరుగుతాయి. వాటన్నింటినీ తెచ్చి గోపురం ఆకారంలో పేర్చి సాయంత్రం చిన్నా పెద్దా అంతా కలిసి బతుకమ్మ ఆడుకుంటారు.
ఈ పూలలో ముఖ్యమైనవి తంగేడు, గునుగు, బంతి, నందివర్ధనం వంటివి ప్రత్యేకం. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగకు వాడే పూలలో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ సమయంలో ముఖ్యంగా జొన్న పంట చేతికి వస్తుంది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సమయంలో ఆడపడుచులంతా పుట్టింటికి చేరుకుంటారు.
సాయంత్రం బతుకమ్మను ఆడిపాడి నిమజ్జనం చేస్తారు. వాయినం ఇచ్చిపుచ్చుకుంటారు. అంతేకాదు పసుపు గౌరమ్మను తయారు చేసి పూజిస్తారు. బతుకమ్మను 9 రోజులపాటు నిర్వహిస్తారు. అంతేకాదు 9 రకాల ప్రసాదాలు కూడా తయారు చేస్తారు. అందులో నాలుగో రోజు వచ్చేదే నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు.
దీనికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఈరోజు వాయినంగా నానబోసిన బియ్యాన్ని బెల్లం లేదా చక్కెరతో కలిపి వాయినంగా ఇస్తారు. ఆశ్వీయుజ అమావాస్యతో ప్రారంభమయ్యే ఈ బతుకమ్మ పండుగను అంగరంగ వైభంగా నిర్వహిస్తారు అక్కాచెల్లెల్లు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుకఃసంతోషాలు వెల్లివిరుస్తాయనే నమ్మకం ఉంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)