BCCI paid to UAE: IPL 2020 కోసం యూఏఈకి బీసీసీఐ ఎంత చెల్లించిందో తెలుసా ?

Tue, 17 Nov 2020-10:41 am,

కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో భారత్‌లో అసలు ఐపిఎల్ నిర్వహణే కష్టం అనుకుంటున్న తరుణంలో 13వ ఐపీఎల్ సీజన్ నిర్వహించేందుకు యూఏఈ, శ్రీలంక ముందుకొచ్చాయి. అయితే, యూఏఈలో ఇప్పటికే 2014 ఐపిఎల్ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించి ఉండటం, అక్కడ మూడు స్టేడియంలు అందుబాటులో ఉండటం, అక్కడి పరిస్థితులు, ఏర్పాట్లు అన్ని తెలిసిన బీసీసీఐ.. యూఏఈ ఇచ్చిన ప్రతిపాదనకే మొగ్గుచూపింది. Image credits: Twitter/@IPL

ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి యూఏఈలో బీసీసీఐ నిర్వహించిన ఈ ఐపిఎల్ 2020ని ఓ స్పెషల్ ఎడిషన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒకే ఒక్కసారి భారత్ లో కాకుండా విదేశీ గడ్డపై ఐపిఎల్ జరిగింది. అది కూడా పూర్తి ఐపిఎల్ కాకుండా పాక్షికంగా కొన్ని మ్యాచ్‌లను మాత్రమే విదేశీ గడ్డపై నిర్వహించారు. అది కూడా యూఏలోనే. కానీ ఈసారి మొత్తం ఐపిఎల్ టోర్నమెంట్ యూఏఈలోనే జరగడం విశేషం. ఈ టోర్నమెంట్‌లోనూ వరుసగా రెండోసారి ముంబై ఇండియన్స్ జట్టే ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడింది.  Image credits: Twitter/@IPL

ఐపిఎల్ 2020 నిర్వహణకు ఎన్నో సవాళ్లు అడ్డంగా నిలిచాయి.. ఆటంకంగా మారాయి. టోర్నమెంట్ ప్రారంభం కాకముందు నుంచే యూఏఈకి చేరుకున్న ఆటగాళ్లను క్వారంటైన్‌కి తరలించినప్పటికీ.. పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. దీంతో పలు ఫ్రాంచైజీలకు టెన్షన్ తప్పలేదు. Image credits: Twitter/@IPL

సాధరణంగానే ఐపిఎల్ లాంటి ఖరీదైన టోర్నమెంట్స్ జరిగేటప్పుడు క్రికెటర్స్‌ బస చేసే హోటల్స్ నిర్వహణకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటిది కరోనా టైమ్స్‌లో జరిగిన టోర్నమెంట్ కావడంతో ఈసారి ఐపిఎల్ నిర్వహణ వ్యయం మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు. Image credits: Twitter/@IPL

కరోనా వ్యాపిస్తున్న తరుణంలోనూ ఎన్నో సవాళ్ల మధ్య ఐపిఎల్ 2020 నిర్వహణకు ముందుకొచ్చి, విజయవంతంగా ఐపిఎల్ టోర్నమెంట్‌‌ని పూర్తి చేసినందుకుగాను యూఏఈకి చెందిన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ అక్షరాల రూ. 100 కోట్లు చెల్లించింది. Image credits: Twitter/@IPL

ఐపిఎల్ 2020పై ఆది నుంచే అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి. అసలు ఐపిఎల్ 2020 జరుగుతుందా అనేదగ్గర మొదలైన గందరగోళం.. ఐపిఎల్ 2020 స్పాన్సర్స్ మార్పు, టోర్నమెంట్స్ ప్రారంభం వరకు కొనసాగింది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్స్ వివోతో జరిగిన ఒప్పందం ప్రకారం ఐపిఎల్ 2020ని వివో స్పాన్సర్ చేయాల్సి ఉండగా.. భారత్-చైనా సరిహద్దుల్లో మొదలైన వివాదం కారణంగా చైనాకే చెందిన వివోపై భారత్‌లో పూర్తి వ్యతిరేకత వ్యక్తమైంది. చైనా మొబైల్ యాప్స్ నిషేధించినట్టుగానే ఐపిఎల్ స్పాన్సర్‌గా వివోను తొలగించాలనే డిమాండ్ నేపథ్యంలో బీసీసీఐ వివోను పక్కనుపెట్టింది.  Image credits: Twitter/@IPL

ఐపిఎల్ 2020 స్పాన్సర్‌షిప్‌ను వివో నుంచి డ్రీమ్ 11కు మార్చిన కారణంగా బీసీసీఐ రూ.220 కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఐపిఎల్ స్పాన్సర్‌షిప్ కోసం వివోతో రూ. 44ద కోట్లకు ఒప్పందం కుదరగా.. దానిని రద్దు చేసుకున్న అనంతరం డ్రీమ్ 11తో రూ.220 కోట్లకే ఒప్పందం జరగడమే అందుకు కారణం. ఇదే కాకుండా ఐపిఎల్ 2020 నిర్వహణ వ్యయం కూడా ఈసారి మరింత పెరిగింది. Image credits: Twitter/@IPL

ఐపిఎల్ నిర్వహణతో యూఏఈకి భారీ మొత్తంలోనే బిజినెస్ జరిగింది. దుబాయ్, అబు ధాబి, షార్జాల్లో మ్యాచ్‌లు జరగడంతో అక్కడ లగ్జరీ హోటల్స్‌గా పేరున్న 14 ఫేమస్ హోటల్స్‌ 3 నెలల పాటు మొత్తం ప్యాక్ అయ్యాయి. Image credits: Twitter/@IPL

భారత్‌లో ఐపిఎల్ జరిగి ఉండుంటే.. ప్రస్తుతం అమలులో ఉన్న బీసీసీఐ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ల‌కి ఆతిథ్యం ఇచ్చినందుకుగాను ఒక్కో మ్యాచ్‌కి స్టేడియం ఫీజు కింద రూ. 1 కోటి చెల్లించాల్సి ఉండేది. ఈ లెక్క ప్రకారం 60 మ్యాచ్‌లకి గాను 60 కోట్లు ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్స్‌కి చెల్లించాల్సి ఉండేది. ఇదే కాకుండా ఫ్రాంచైజీలు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇచ్చినందుకుగాను ఒక్కో మ్యాచ్‌కి రూ. 50 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. గతంలో రూ. 30 లక్షలుగా ఉన్న ఈ ఫీజును ఇటీవలే బీసీసీఐ రూ.50 లక్షలకు పెంచింది. Image credits: Twitter/@IPL

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link