Health tips for glowing skin: అందమైన మెరిసే చర్మం కోసం
రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగాలి. అప్పుడే శరీరం కాంతిని కోల్పోకుండా ఉంటుంది. లేదంటే శరీరం పొడిబారి సహజత్వాన్ని కోల్పోతుంది. ఫలితంగా చర్మం అందంగా కనిపించదు.
రాత్రి పూట ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాతే నిద్రపోవాలి. ఎందుకంటే మేకప్, దుమ్ము ముఖం మీది చర్మరంద్రాలను మూసివేస్తాయి. అలానే ఆల్కహాల్ లేని టోనర్ ఉపయోగించాలి. రోజ్ వాటర్ వాడాలి. అలాగే చర్మాన్ని మెరిపించే విటమిన్ సి సీరమ్ వాడాలి.
చక్కర శాతం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను అపరిమితంగా తినడం మానేయాలి. లేదంటే శరీరంలోకి కొవ్వు చేరి అది శరీరం యవ్వనాన్ని కోల్పోయేలా చేస్తుంది.
చర్మ సౌందర్యం కోసం, యవ్వనం కోసం సరైన, హాయినిచ్చే నిద్ర ఎంతో అవసరం. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి.
తాజా కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినాలి. అయితే పండ్లరసం తాగడం కన్నా నేరుగా పండ్లను తినడమే మంచిది. ఎందుకంటే.. పండ్ల రసం తాగే క్రమంలో పండ్లలోని పిప్పీ పదార్థాన్ని పడేస్తారు. ఫలితంగా శరీరానికి ఫైబర్ అందదు. శరీరానికి ఫైబర్ అందాలి అంటే పండును రసం తీసి తాగడం కంటే పండులాగే తినడం మంచిది.
చర్మ సౌందర్యం కోసం తగిన జాగ్రత్తు తీసుకుంటూనే ప్రతీ రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అప్పుడే చర్మం కాంతులీనుతుంది. చర్మం పటుత్వం కోల్పోకుండా, ముడుతలు రాకుండా యవ్వనంగా ఉంటుంది. మరిన్ని జాగ్రత్తలు ఏమిటంటే..
చివరగా చర్మం గుణాన్ని బట్టి తగిన మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఉదయాన్నే ముఖం శుభ్రం చేసుకొని సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి. ఫలితంగా శీతాకాలంలో చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. శీతాకాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే ఇది తప్పనిసరి.