Beetroot Leaf Health Benefits: బీట్‌రూట్ ఆకుల గురించి ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
బీట్‌రూట్ ఆకుల్లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పెరుగుదలకు అత్యంత అవశ్యకం. దీంతో ఫ్లూ, జలుబు బారిన పడకుండా కాపాడుతుంది.
కొన్ని నివేదికల ప్రకారం బీట్‌రూట్‌లో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఆక్సిజన్ లెవల్స్ ను మన శరీరంలో పెంచి బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. తద్వారా గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది.
బీట్‌రూట్ ఆకుల్లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇందులో లుటీన్ ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బీట్‌రూట్ ఆకుల్లో కనిపిస్తాయి. ఇది వృద్ధాప్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.
బీట్‌రూట్ ఆకుల్లో ఎక్కువ మొత్తంలో కాల్షియం, మెగ్నిషియం, విటమిన్ డీ, కే ఉంటాయి. ఇవి ఎముక ఆరోగ్యానికి అవశ్యకం.
కొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్ బీ6, నైట్రేట్స్ బీట్ రూట్ ఆకుల్లో ఉంటాయి. ఇవి మెదడుకు రక్త సరఫరాను పెంచి, అభిజ్ఞా క్షీణతను రానివ్వకుండా కాపాడుతుంది.
ఇందులో కరిగే, కరగని రెండు ఫైబర్స్ ఉంటాయి. బీట్‌రూట్ ఆకులు పేగు కదలికను నిర్వహించి, మంచి బ్యాక్టిరియా పెరుగుదలకు ప్రేరేపిస్తాయి.
కొన్ని క్లినికల్ నివేదికల ప్రకారం ఫోలేట్, విటమిన్ బీ9 బీట్‌రూట్ ఆకుల్లో ఉంటాయి. ఇది బిడ్డ అభివృద్ధికి, పెరుగుదలకు సహాయపడతాయి.
బీట్‌రూట్ ఆకుల్లో ఉండే డైటరీ ఫైబర్ బరువు నిర్వహణకు సహాయపడతాయి. ఇవి ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.