Belly Fat Lose Tips: పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..
పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకునే సందర్భంలో తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది వ్యాయమాలు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే దీని కోసం రోజూ ఉదయం పూట వ్యాయామాలు చేస్తే శరీరం దృఢంగా మారుతుంది.
శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునే క్రమంలోత శుద్ధి చేసిన పిండి పదార్థాలను తినొద్దు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కావున బరువు తగ్గించుకునే క్రమంలో ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.
పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టే క్రమంలో అస్సలు అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవద్దు. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్‌ను తీసుకోకూడదని నిపుణులు తెలుపుతున్నారు. కల్తీ నెయి, హానికరమైన పాలు తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ సమస్యలు పెరుగుతాయి. కావున వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.
ఆహారంలో పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి.. పుష్కలంగా ప్రోటీన్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యలు దూరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు చాలా రకాల చిట్కాలున్నాయి. అయితే ఈ చిట్కాలను వినియోగిస్తే.. పొట్ట చుట్టూ సమస్యలు దూరమవుతాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తీసుకునే ఆహారంలో చక్కెరతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండండాలని నిపుణులు తెలుపుతున్నారు.