Belly Vs Thigh Fat: పొట్ట దగ్గర కొవ్వు వర్సెస్ తొడ చుట్టు అధిక కొవ్వు.. వీటిలో ఏది ఎక్కవ డెంజరో తెలుసా..?
ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవనం కొనసాగుతుంది. కనీసం తినడానికి కూడా సమయంలేని విధంగా మారిపొయింది. చాలా మంది టైమ్ కు వంటచేసుకొలేక.. బైటి ఫుడ్ ను ఎక్కువగా తింటున్నారు. బైటి ఫుడ్ తినడం వల్ల చాలా మంది అనారోగ్యాల బారినపడుతున్నారు. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తినడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురౌతుంటాయి.
కొందరు తినాల్సిన సమయంలో పడుకోవడం, పడుకొవాల్సిన టైమ్ లో జాబ్ లు చేస్తుంటారు. దీని వల్ల జీవ గడియారం పూర్తిగా మారిపోతుంది. ఒక వ్యక్తి పూర్తిగా అనారోగ్యం బారిన పడిపోతాడు. ఈ క్రమంలో.. కొందరు బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతుంటే.. మరికొందరు తోడల దగ్గర కోవ్వు పేరుకుపోయి ఇబ్బందులు పడుతుంటారు.
బెల్లీ ఫ్యాట్ అనేది గంటల కొద్ది అస్సలు కదలకుండా.. కూర్చుని జాబ్ చేసుకునే వారిలో ఎక్కువగా కన్పిస్తు ఉంటుంది. వీరు ముఖ్కంగా.. ఎటు కదలకుండా ఉండిపోతారు. చాలా స్ట్రెయిన్ లో గురిఅవుతారు. ఎంత బిజీగా ఉన్న గంటకు ఒకసారి పదినిముషాలు లేచి అటు ఇటు నడిచి మరల కూర్చొవాలి. జంక్ ఫుడ్ లను అవాయిడ్ చేస్తు ఉండాలి.
మరికొందరు తొడల దగ్గర కొవ్వు పేరుకుపోవడం సమస్యతో బాధపడుతుంటారు. పొట్ట దగ్గర కంటే.. తోడల దగ్గర కొవ్వు వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. వీరు కనీసం నిలబడటానికి కూడా నానా ఇబ్బందులు పడుతుంటారు. బ్యాలెన్ తప్పిపడిపోతుంటారు.
పొట్ట దగ్గర కొవ్వు ఉన్న వారిలో.. పిల్లలు పుట్టడంలో బాగా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా సెక్సువల్ జీవితంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీని వల్ల ఒత్తిడి వంటి, అలసట వంటివి ఏర్పడతాయి. ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి.
కాళ్ల దగ్గర కొవ్వులు పేరుకోని పోవడం వల్ల.. ఎక్కువ దూరం నడవలేరు. కొంచెం నడవగానే ఆయాసం వచ్చి ఆగిపోతుంటారు. అందుకు ఇటు బెల్లీ ఫ్యాట్, పొట్ట దగ్గర కొవ్వు రెండు కూడా ప్రమాదమే అని నిపుణులు చెబుతుంటారు. టైమ్ కు తినడం, ఎక్సర్ సైజ్ లు చేయడం, ఒత్తిడిలేకుండా పనిచేయడం వల్ల ఈ సమస్యల నుంచి బైటపడొచ్చు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)