Second Hand Bike on Lowest Price: తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్ బైక్స్.. ఎన్నో ప్రయోజనాలు

Sun, 06 Dec 2020-6:58 pm,

కరోనా వైరస్, లాక్‌డౌన్ సమయాలలో ఎన్నో వస్తువులు, ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. అయితే డిమాండ్ పెరిగిన ఉత్పత్తులు ఏమన్నా ఉన్నాయంటే మోటార్ బైక్స్, కార్లు. ఎందుకు పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఏది వాడినా కరోనా వైరస్ బారిన పడతామనే భయంతో సొంతంగా కొత్త వాహనాలు కొనుగోలు చేయలేని వారు సెకండ్ హ్యాండ్ బైక్స్ (Second Hand Bikes On Lowest Price), కార్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీటికి భారీగా డిమాండ్ ఏర్పడింది.

Hero Splender Plus 100cc: హీరో కంపెనీ ఉత్పత్తి అయిన హీరో స్ప్లెండర్ ప్లస్ 100cc 2016 మోడల్ బైక్. ఇది ప్రస్తుతం రూ.31,900 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీన్ని బైక్ ఫస్ట్ ఓనర్ అమ్ముతున్నారు. ఈ బైక్ మైలేజీ వింటే కచ్చితంగా కొనుక్కుంటారు. 81 కిలోమీటర్ల మైలేజీ దీని సామర్థ్యం. ఇప్పటివరకూ 9వేల కిలోమీటర్లు నడిపారు.

Bajaj V15 150cc: బజాజ్ వీ15 150సీసీ బైక్ 2016 మోడల్. దీన్ని రూ.5,460 ధరకు బైక్ ఫస్ట్ ఓనర్ విక్రయిస్తున్నారు. ఈ బైక్ ఇప్పటివరకూ 4,500 కి.మీ నడిచింది. దీని వీల్ సైజ్ 18 ఇంచులు. కాగా లాక్‌డౌన్ తర్వాత అత్యధికంగా విక్రయాలు జరిగిన సెకండ్ హ్యాండ్ బైక్స్‌లో ఇది ఒకటి.

Bajaj Discover 125cc: బజాజ్ కంపెనీ నుంచి విడుదలైన అత్యుత్తమ బైక్ బజాజ్ డిస్కవర్ 125cc. బజాజ్ కంపెనీలో అధికంగా అమ్మకాలు జరిగే బైక్ కూడా ఇదే. 2018 మోడల్ బైక్‌ను కొనుగోలు చేసేందుకు కరోనా వ్యాప్తి సమయంలో భారీగా డిమాండ్ పెరిగింది. డ్రూమ్ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. ఈ బైక్ ఒక లీటర్‌కు 65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇది 125సీసీ ఇంజిన్ బైక్. దీని ధర రూ.37,525. మైలేజీ గురించి ఆలోచించేవారు ఈ సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా! ​

సెకండ్ హ్యాండ్ బైక్ కొనడం వల్ల ప్రయోజనాలున్నాయి. కొత్త బైక్ కొనే ధరలో సగానికే సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల మీ పెట్టుబడి సగం తగ్గుతుంది. మీ అవసరం తీర్చుకునేందుకు త్వరగా బైక్ కొనాలంటే ఇది ఒక మార్గం. బడ్జెట్ మీద బతికే సామాన్యుడికి ఇంతకు మించిన బెటర్ ఆప్షన్ ఉండదు. బండి కండీషన్ చెక్ చేసిన తర్వాత కొనడం మాత్రం మరిచిపోవద్దు.

Also Read : Card Transactions: కాంటాక్ట్ లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్ పరిమితి పెంచిన RBI

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link