Viral news: వామ్మో.. నిద్రపోయి ఏకంగా 9 లక్షలు గెల్చుకుంది.. స్టోరీ తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోద్ది..
చాలా మందికి ఇటీవల కాలంలో కంటి నిండా నిద్ర, కడుపు నిండా మంచి ఫుడ్ ఉండటంలేదని చెప్పుకొవచ్చు. ఉద్యోగాల బిజీలో లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పనులల్లో బిజీగా ఉంటున్నారు. కేవలం నిద్రకు కొన్నిగంటలు మాత్రమే కేటాయిస్తున్నారు.
సాయిశ్వరీ పాటిల్ అనే బెంగళూరు మహిళ నిద్రపోవడం ద్వారా.. ₹9 లక్షల భారీ మొత్తాన్ని గెలుచుకుంది. సాయిశ్వరి ఈ వార్తను తను గెల్చుకున్న అమౌంట్ వివరాలు తెలియజేసినప్పుడు.. "ఐసే కైసే హోసక్తా హై" అని ఆమె తల్లి ఆమెను మరల ప్రశ్నించింది.
మీరు నిద్రపోవడానికి మాత్రమే బహుమతిని గెలుచుకునే పరిస్థితి గురించి ఎప్పుడైనా విన్నారా?.. అది కూడా లక్షల వరకు కలిపిన మొత్తానికి?.. అని అందరు నోరెళ్లబెడుతున్నారు.
సాయిశ్వరి బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌తో చాలా మంది తమ కలల్ని సాకారం చేసుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ వేక్‌ఫిట్ యొక్క స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ యొక్క మూడవ సీజన్‌లో 'స్లీప్ ఛాంపియన్' టైటిల్‌ను గెలుచుకున్నందుకు ఆమె భారీ మొత్తాన్ని బహుమతిగా అందుకుంది.
ప్రోగ్రామ్‌లోని 12 మంది ఇతర స్లీప్ ఇంటర్న్‌లలో ఆమె కూడా ఉంది. సాయిశ్వరి స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా నిద్రకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తుల జాబితాలో తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి వ్యక్తి ప్రతి రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు పూర్తిగా నిద్రపోవాలి.
అంతేకాకుండా, ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు పగటిపూట 20 నిమిషాల మంచి నిద్రను కూడా తీసుకోవాలని కూడా రూల్ పెట్టారు. వీరి నిద్ర అలవాట్లను ట్రాక్ చేయడానికి సిస్టమ్ సైతం ఏర్పాటు చేశారు. వీరికి.. స్లీప్ ట్రాకర్‌ను అమర్చారు.. దీనితో వారు ఎన్ని గంటలు డీప్ స్లీప్ లో పడుకున్నారో తెలిసిపోతుంది. చాలా మంది పడుకుంటారు.. కానీ అంతబాగా నిద్ర ఉండదన్నమాట. కేవలం ఏ కాస్త చప్పుడొచ్చిన, ఉలిక్కిపడి లేస్తుంటారు.
వీరు కదలకుండా డీప్ స్లీప్ ఎవరైతే ఎక్కువ సేపు పడుకుంటారో.. వారి ఈ పోటీల్లో విజేతలుగా నిర్ణయిస్తారు. ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ 2024 యొక్క వేక్‌ఫిట్ యొక్క ఏడవ ఎడిషన్ ప్రకారం, దాదాపు 50% మంది భారతీయులు నిద్ర లేవగానే అలసిపోయారని నివేదించారు. మన దేశంలో, అధిక పని గంటలు, చెడు నిద్ర వాతావరణం వంటి అనేక కారణాల వల్ల నిద్ర లేమి అనేది ఒక విస్తృతమైన సంఘటనగా మారిందని చెప్పుకొవచ్చు.