Best Foods for Liver: ఈ 5 ఫుడ్స్ డైట్ లో ఉంటే ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ వంటి సమస్యలకు చెక్
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఎలిసిన్, సెలేనియమ్ అంటే పోషకాలు లివర్ క్లీన్ చేయడంలో దోహదపడతాయి. లివర్ ఎంజైమ్స్ ను యాక్టివేట్ చేస్తాయి. విష పదార్ధాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి. ప్యాటీ లివర్ సమస్యను కూడా తగ్గిస్తాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లివర్ ను విష పదార్ధాల నుంచి రక్షిస్తాయి. ఇందులో ఉండే కైటోక్విన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. గ్రీనీ టీ పరిమితంగా తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య కూడా తగ్గుతుంది.
పసుపు
పసుపులో కర్క్యూమిన్ అనే పదార్ధముంటుంది. ఇది లివర్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కర్క్యూమిన్ అనేది సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ. లివర్ స్వెల్లింగ్ తగ్గిస్తుంది.
బెర్రీస్
బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ బెర్రీస్ వంటి బెర్రీ ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఏంథోసయానిన్ అనే పదార్ధం బెస్ట్ ఇన్ ఫ్లమేటరీగా పనిచేస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది.
అవకాడో
అవకాడోలో హెల్తీ ఫ్యాట్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే గ్లూట్ థియోన్ యాంటీ ఆక్సిడెంట్ విష పదార్ధాలను బయటకు పంపించడంలో ఉపయోగపడుతుంది. అవకాడోను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది.