How to Control Sugar: బ్లడ్ షుగర్ ప్రమాదకరంగా మారుతుందా, ఈ 5 జ్యూస్‌లు తాగితే చాలు
క్యారట్ జ్యూస్
క్యారట్‌లో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది. షుగర్ లెవెల్స్ అదుపు చేస్తుంది.
టర్నిప్ జ్యూస్
టర్నిప్ జ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇదొక లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పదార్ధం. శరీరంలో ఇన్సులిన్ లెవెల్ కూడా పెరుగుతుంది. రక్తంతో చక్కెర శాతం తగ్గుతుంది
పాలకూర జ్యూస్
పాలకూర జ్యూస్‌లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పెద్దఎత్తున ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. పాలకూర జ్యూస్ తాగడం వల్ల శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు దోహదం అవుతుంది. డయాబెటిస్ లక్షణాలను ఈ జ్యూస్ ద్వారా చాలా వరకు తగ్గించవచ్చు
టొమాటో జ్యూస్
టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ రోగులు రోజూ క్రమం తప్పకుండా టొమాటో జ్యూస్ తాగితే బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది.
కాకరకాయ
కాకరకాయలో బిటర్స్ అనే పోషకం ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో దోహదం చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే రోజూ ఒకసారి కాకరకాయ జ్యూస్ తాగితే మంచి ఫలితాలుంటాయి.