Liver Health Foods: లివర్‌ను క్లీన్ అండ్ హెల్తీగా ఉంచే 5 అద్భుత పదార్ధాలు

Sat, 31 Aug 2024-9:57 am,

పసుపు

పసుపులో ఉండే కర్‌క్యూమిన్ ఓ శక్తివంతమైన కెమికల్. ఇది లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లివర్ స్వెల్లింగ్ తగ్గుతుంది. విష పదార్ధాలు బయటకు పంపించడంలో దోహదమౌతుంది. పసుపు లివర్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

వాల్‌నట్స్

వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లివర్ స్వెల్లింగ్ తగ్గిస్తాయి. విష పదార్ధాలను బయటకు పంపిస్తాయి. 

బీట్‌రూట్

బీట్‌రూట్‌లో బీటైన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లివర్ డీటాక్సిఫికేషన్‌కు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

ఆకు కూరలు

పాలకూర, మెంతి కూర, తోటకూర వంటి ఆకు కూరలు ఆరోగ్యానికి ముఖ్యంగా లివర్ హెల్తీగా ఉంచేందుకు చాలా మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. విష పదార్ధాలు బయటకు పంపించడంలో దోహదమౌతాయి. 

గ్రీన్ టీ

గ్రీన్ టీలో కెటోచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది లివర్‌ను హెల్తీగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. లివర్ సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. లివర్ రిజ్యువనేట్ సామర్ధ్యాన్ని పెంచుతుంది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link