Anti Ageing Tips: ఈ టిప్స్ పాటిస్తే చాలు వృద్ధాప్యం దరి చేరదిక
బ్యాలెన్స్డ్ డైట్
చర్మం హెల్తీగా, యాక్టివ్‌గా ఉండేందుకు అవసరమైన పోషకాలు తప్పకుండా తీసుకోవాలి. తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్ తప్పకుండా తినాలి
సన్ స్క్రీన్
ప్రతి రోజూ సన్ స్క్రీన్ రాసి చర్మాన్ని హానికారకమైన యూవీ కిరణాల నుంచి రక్షించుకోవాలి. దీనివల్ల సమయానికి ముందే తలెత్తే వృద్ధాప్యాన్ని తగ్గించవచ్చు. స్కిన్ కేన్సర్ ముప్పును తగ్గించవచ్చు.
బాడీ హైడ్రేట్
రోజూ తగిన పరిమాణంలో నీళ్లు తప్పకుండా తాగాలి. దీనివల్ల చర్మం ఎలాస్టిసిటీ కొనసాగుతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. యౌవనంగా కన్పిస్తుంది.
నో స్మోకింగ్-నో లిక్కర్
స్మోకింగ్, లిక్కర్ కారణంగా కొలాజెన్ దెబ్బ తింటుంది. ఫలితంగా చర్మంపై ముడతలు పడతాయి.
మాయిశ్చరైజర్
చర్మాన్ని యౌవనంగా ఉంచేందుకు రోజూ క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ రాయడం అలవాటు చేయాలి.
ఒత్తిడి తగ్గించడం
ఒత్తిడి తగ్గించేందుకు మెడిటేషన్, యోగా వంటివి అలవర్చుకోవాలి. శ్వాస ధీర్ఘంగా తీసుకుని వదలడం ప్రాక్టీస్ చేయాలి. ఒత్తిడి అనేది వృద్ధాప్యాన్నే కాదు..వ్యాధుల్ని కూడా తగ్గిస్తుంది
స్కిన్ కేర్
రెటినాయిడ్, హాలురోనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే స్కిన్ కేర్ ఉత్పత్తులు తీసుకోవాలి. ఫలితంగా ఏజీయింగ్ లక్షణాలు తగ్గుతాయి
వ్యాయామం
రోజూ క్రమం తప్పకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. దీనికోసం రక్త సరఫరా మెరుగుపడుతుంది. చర్మంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ సరఫరా అవుతుంది. హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది.