Business Idea: లక్షల్లో ఆదాయం వచ్చే బిజినెస్.. రైల్వే స్టేషన్‌లో దుకాణం ఎలా తెరవాలో తెలుసా?

Wed, 07 Aug 2024-9:52 pm,

How To Open Shop At Railway Station: రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక సౌకర్యం కింద దుకాణం లేదా వ్యాపారం చేసే అవకాశం లభిస్తుంది. మీరు రైల్వే స్టేషన్‌లో దుకాణం తెరవాలంటే దాని ప్రక్రియ తెలుసుకోవాలి.

How To Open Shop At Railway Station: దేశంలో 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటి నుంచి లక్షల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్‌లలో దుకాణం తెరవడంతో ఉపాధి పొందవచ్చు. టీ, కాఫీ లేదా అల్పాహారం తయారు చేయాలో తెలిస్తే రైల్వే స్టేషన్‌లో ఒక చిన్న స్టాల్‌ని ఏర్పాటు చేసి విక్రయించుకోవచ్చు.

How To Open Shop At Railway Station: స్టేషన్‌లలో పుస్తకాలను అమ్మడం కూడా ప్రారంభించవచ్చు. ఇతర చాలా దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే రైల్వే స్టేషన్‌లో మీ దుకాణం ప్రారంభించాలంటే టెండర్ల ద్వారా సాధ్యమవుతుంది.

How To Open Shop At Railway Station: స్టేషన్‌లో దుకాణాలు తెరవడానికి  రైల్వే శాఖ ఎప్పటికప్పుడు టెండర్లు ప్రకటిస్తుంటుంది. ఆ టెండర్లకు దరఖాస్తు చేస్తే మీకు స్టేషన్‌లో దుకాణం లభిస్తుంది.

How To Open Shop At Railway Station: రైల్వే శాఖ ఎప్పుడు టెండర్లు వేస్తుందో ఎప్పటికప్పుడు IRCTC పోర్టల్‌ను సందర్శించాలి. అంతేకాకుండా రైల్వేలోని వివిధ జోన్ల వారీగా టెండర్లు విడుదలవుతాయి. ప్రాంతీయ రైల్వే వెబ్‌సైట్‌లో టెండర్ల నోటీసులను ఎప్పుడూ పరిశీలిస్తుండాలి.

How To Open Shop At Railway Station: మీరు ప్రారంభించాలనుకుంటున్న దుకాణం రకం టెండర్‌ పడితే అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. దుకాణం ప్రారంభించే ముందు టెండర్‌ నోటిఫికేషన్‌ శ్రద్ధగా చదవాలి. అన్ని వివరాలు పూర్తిగా.. క్షుణ్నంగా తెలుసుకోవాలి.

How To Open Shop At Railway Station: దుకాణం ప్రారంభించాలంటే ముందుగా రైల్వే శాఖకు డిపాజిట్‌ రూపంలో కొంత చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ కేటగిరీ ప్రకారం రూ.40,000 నుంచి రూ.3 లక్షల వరకు డిపాజిట్ ఉంటుంది. అయితే దుకాణం వైశాల్యం.. వ్యాపారం అనుసరించి డిపాజిట్‌లో మార్పులు ఉంటాయి.

How To Open Shop At Railway Station: స్టేషన్‌లో దుకాణం తెరవాలంటే ముందు దుకాణానికి స్థలాన్ని పొందడం. దీని కోసం IRCTC వెబ్‌సైట్‌ను, జోన్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. రైల్వే స్టేషన్‌లో దుకాణాన్ని తెరిచే ప్రక్రియ కోసం, మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్ వంటి అవసరమైన పత్రాలను కలిగి ఉండాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link