Best Fruits For Diabetes: మధుమేహాన్ని కంట్రోల్ చేసే 7 పండ్లు ఇవే..

మధుమేహంతో బాధపడే వారికి డైట్లో భాగంగా ఫైబర్ కలిగిన పండ్లను తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రిస్తాయి.

యాపిల్స్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటి GI కూడా తక్కువగా ఉంటుంది. ఒక కప్పు బ్లూబెర్రీలలో సుమారు 80 కేలరీలు, 4 గ్రాముల ఫైబర్‌తో పాటు 16 గ్రాముల చక్కెర ఉంటాయి. వీటిని తినడం కూడా ఎంతో మంచిది.
నారింజలో విటమిన్ సి, పొటాషియంతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఒక మధ్యపాటి నారింజలో సుమారు 62 కేలరీలు, 3.1 గ్రాముల ఫైబర్, 12 గ్రాముల చక్కెర ఉంటాయి. వీటిని మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు తినడం వల్ల అనే లాభాలు కలుగుతాయి.
పియర్స్ ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఒక మధ్యపాటి పెయిరాలో సుమారు 100 కేలరీలు, 5.1 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు తినడం ఎంతో మంచిది.
పుచ్చకాయలో నీరు, విటమిన్ సి, పొటాషియం అధిక మోతాదులో లభిస్తుంది. ఒక కప్పు పుచ్చకాయ ముక్కలలో సుమారు 46 కేలరీలు, 0.6 గ్రాముల ఫైబర్, 11 గ్రాముల చక్కెర ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.
ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియంతో పాటు విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ద్రాక్షలో సుమారు 104 కేలరీలు, 1.4 గ్రాముల ఫైబర్‌తో పాటు 23 గ్రాముల చక్కెర ఉంటాయి. కాబట్టి దీనిని తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
కీవీలు విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఒక మధ్యపాటి కీవీలో సుమారు 61 కేలరీలు, 2.1 గ్రాముల ఫైబర్, 11 గ్రాముల చక్కెర ఉంటాయి. మధుమేహం ఉన్నవారు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.