Get Rid Of Ants: మీ ఇంట్లోకి చీమలు రాకుండా ఉండాలంటే సింపుల్ చిట్కాలు!
నిమ్మకాయలో విటమిన్ సీ ఉంటుంది. ఇది యాసిడిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని ఫ్లోర్ క్లీనింగ్‌లో కూడా ఉపయోగించవచ్చు. నిమ్మరసం చీమలు ఉన్న ప్రాంతంలో నిమ్మరసం పిండాలి. దీని ఘాటు వాసనకు అవి పారిపోతాయి. అంతేకాదు నిమ్మరసం పిండిన తొక్కలను కూడా చీమలు తిరిగే ప్రాంతంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి చీమలు రాకుండా ఉంటాయి.
సుద్ద కూడా చీమలు రాకుండా ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి. ఇది కాల్షయం కార్బొనేట్ చీమలు ఈ వాసనను తట్టుకలేవు ఫలితంగా వెంటనే ఆ ప్రాంతం నుంచి పారిపోతాయి. ముఖ్యంగా చీమలు ఎక్కువగా తిరుగుతున్న ప్రాంతంలో సుద్ద పొడిని చల్లండి ఇలా చల్లడం వల్ల కూడ చీమలు వెళ్లిపోతాయి.
లవంగాలు, దాల్చినచెక్క పొడి చేసి చీమలు తిరిగే ప్రదేశలో చల్లుకున్నా ఆ ఘాటు వాసనకు అవి దూరంగా పారిపోతాయి. ఈ ఎఫెక్టీవ్ హోం రెమిడీతో చీమలు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు.
వెనిగర్ కూడా పుల్లని వాసన కలిగి ఉంటుంది. దీని ఘాటైన వాసనకు కూడా చీమలు పారిపోతాయి. వెనిగర్ ను చీమలు తిరిగే ప్రాంతంలో చల్లుకోవాలి. అంతేకాదు ఇంటి వంటగది టేబుల్‌ను వెనిగర్ తో తుడుచుకోవాలి ఇలా చేయడం వల్ల కూడా చీమలు వెంటనే పారిపోతాయి.
చీమలు ఇంట్లో ఎక్కువగా తిరిగితే ఆ ప్రాంతంలో నల్ల మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు.ముఖ్యంగా ఆహారాలు నిల్వ చేసే ప్రదేశంలో చీమలు ఎక్కువగా తిరుతాయి కాబట్టి నల్లమిరియాల పొడిని ఈ ప్రాంతంలో చల్లుకోండి.
సాధారణ ఉప్పు ఇది కూడా మన వంటగదిలో సులభంగా లభించే పదార్థం. ఈ ఉప్పును చీమలు తిరిగే ప్రవేశ ద్వారం వదద చల్లుకోవాలి. దీంతో చీమలు దూరంగా పారిపోతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )