Premature Greying Hair: ఖర్చు లేకుండా తెల్లజుట్టును ఇలా నల్లగా మార్చుకోండి!
ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవుతూ కొన్ని సహజమైన హెర్బల్ హెయిర్ ప్యాక్‌లు నెరిసిన జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు.
ఉసిరికాయ.. ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. అంతే కాకుండా ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ ,శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మూలకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. దీంతో నెరిసిన జుట్టు, జుట్టు రాలడం తదితర సమస్యలన్నీ ఒకేసారి పరిష్కారం అవుతాయి.
కరివేపాకు.. కరివేపాకులో మెలనిన్ అనే సహజ వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది జుట్టును నల్లగా చేస్తుంది.
నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తక్కువ మంటపై మరిగించండి. ఆ తర్వాత ఒక పిడికెడు కరివేపాకులు వేయండి. చిన్న మంట మీద కరివేపాకు నల్లగా మారే వరకు నూనె వేసి మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఈ నూనెను జుట్టు మూలాలకు తలకు పట్టించి సరిగ్గా మసాజ్ చేయాలి
కర్పూరం.. ఈ నూనె వేడి అయ్యాక అందులో మందార పువ్వు నూనెలో వేయండి, రెండు నిమిషాల తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయండి. రెండు కర్పూరం మాత్రలను గ్రైండ్ చేసి ఈ మిశ్రమంలో వేసి బాగా కలపి చల్లారిన తర్వాత హెయిర్ కు అప్లై చేయండి.