Curry Leaves Benefits: డయాబెటిస్, హెయిర్ ఫాల్ సమస్యల్ని కరివేపాకులు ఎలా తగ్గిస్తాయంటే
డయాబెటిస్ నియంత్రణ
డయాబెటిస్ సమస్యతో బాధపడేవాళ్లు రోజూ ఉదయం పరగడుపున కరివేపాకులు 4-5 తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
నోటి దుర్వాసన దూరం
నోటిని శుభ్రపర్చేందుకు కరివేపాకులు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఉదయం లేచిన వెంటనే పరగడుపున కరివేపాకులు తింటే చెడు బ్యాక్టీరియా దూరమౌతుంది. నోరు శుభ్రమౌతుంది. ఫలితంగా నోటీ దుర్వాసన ఉండదు.
పరగడుపున కరివేపాకులు తింటే
మనం చర్చించేది కరివేపాకు మొక్క గురించి. కరివేపాకులతో కాడా తయారు చేసి తాగితే అద్బుతమైన ప్రయోజనాలుంటాయి. చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పవచ్చు. శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచవచ్చు. కరివేపాకుల్లో ఐరన్, ఫాస్పరస్, బీటా కెరోటిన్, ప్రోటీన్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. శరీరంలో విష పదార్ధాలను బయటకు తొలగించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
కరివేపాకులు ఎప్పుడు తినాలి
ఉదయం వేళ పరగడుపున రోజు 4-5 కరివేపాకులు నమిలి తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఒకేసారి తినలేకపోతే క్రమక్రమంగా పెంచుకుంటూ పోవాలి.
జీర్ణక్రియ పటిష్టం
కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్లు కరివేపాకు జ్యూస్ తాగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మెటబోలిజం వేగవంతమౌతుంది. శరీరం బరువు కూడా అదుపులో ఉంటుంది.