Maldives Trip: పెళ్లైన కొత్తలో పర్ఫెక్ట్ హనీమూన్ స్పాట్ మాల్దీవులు.. మరింత రొమాంటిక్‌గా మారిపోండి

Sun, 07 May 2023-2:28 pm,

హనీమూన్‌కు ఎక్కడికి వెళుతున్నారని ఏ జంటను అడిగినా.. ముందుగా తాము మాల్దీవుల ట్రిప్‌కు వెళుతున్నామని చెబుతున్నారు. పర్ఫెక్ట్ హనీమూన్ డెస్టినేషన్‌గా మాల్దీవులు మారింది.   

గోవా తరువాత జంటలకు హనీమూన్ కోసం మాల్దీవులు సరైన ప్రదేశం అని చెప్పొచ్చు. మాల్దీవుల సముద్రం ఒడ్డున పెళ్లి అయిన నూతన జంట ప్రతి క్షణం ఆస్వాదిస్తూ గడపొచ్చు.   

మాల్దీవుల విమానాశ్రయం నుంచే ప్రతి ఒక్కరూ సముద్ర అందాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచే పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు.   

ఈ అందమైన బ్లూ వాటర్‌తో జంటల హనీమూన్ మరింత రొమాంటిక్‌గా మారుతుంది. ఈ ప్రదేశం అందంగా ఉండటమే కాకుండా చాలా ప్రశాంతంగా.. సురక్షితంగా ఉండడంతో ఎక్కువ మంది ఇక్కడికి హానీమూన్‌కు వస్తున్నారు. 

మాల్దీవులలో విలాసవంతమైన రిసార్ట్‌లు, బెస్ట్ ఫుడ్, అన్ని వసతులు ఉన్నాయి. మాల్దీవులకు రావడం ద్వారా మీరు అందమైన ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.  

మాల్దీవులు ఎల్లప్పుడూ హనీమూన్‌కు సరైన హాట్ స్పాట్ అని పర్యాటకులు చెబుతుంటారు. ఇక్కడికి రావడం ద్వారా సరికొత్త జీవితాన్ని గడపడానికి మంచి అవకాశం దొరుకుతుందని అంటున్నారు. మీకు కొత్తగా పెళ్లి అవుతున్నా.. రీసెంట్‌గా అయినా మాల్దీవుల ట్రిప్‌కు ప్లాన్ చేసేయండి..   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link