Best Immunity Foods: వర్షాకాలంలో తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవే లేకపోతే ఈ సమస్యలు తప్పవు
ఆనపకాయ
ఆనపకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ. అందుకే ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇందులో విటమిన్ సి, కాల్షియం, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పెంచేందుకు దోహదం చేస్తాయి. ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
కాకరకాయ
కాకరకాయ రుచిలో చేదుగా ఉన్నా ఆరోగ్యపరంగా చాలా అద్బుతమైంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బయో యాక్టివ్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
టొమాటో
ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. విటమిన్ సి శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచుతాయి.
బెండకాయ
ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కేతో పాటు ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, అయోడిన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫ్లెవనాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి.
పాలకూర
పాలకూరలో ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఫలితంగా ఇమ్యూనిటీ బలోపేతమవుతుంది. వర్షాకాలంలో పాలకూర తినడం వల్ల ఇన్‌ఫెక్షన్ ముప్పు తగ్గించవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.