Turmeric Face Packs: పసుపుతో 5 ఫేస్‌ప్యాక్స్ ఇలా అప్లై చేస్తే ఇక నిత్య యౌవనమే
పసుపుతో టొమాటో రసం
సెన్సిటివ్ స్కిన్ కలిగినవారికి ఇది బాగుంటుంది. టొమాటోలో ఉండే లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు స్వెల్లింగ్ సమస్యను తగ్గిస్తాయి. వయస్సుకు ముందే ఏజీయింగ్ సమస్యను దూరం చేస్తుంది. ముఖంపై మంట, దురద తగ్గుతాయి
పసుపు పాలు
పసుపులో పాలు కలిపి ముఖానికి రాయడం వల్ల చర్మంపై ఉండే మొటిమలు తగ్గిపోతాయి. దాంతోపాటు చర్మంపై ఉండే ఇరిటేషన్ తగ్గుతుంది. పాలలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ నేచురల్ ఎక్స్‌ఫోలియేట్ కింద పనిచేస్తుంది. చర్మంపై ఉండే డెడ్ సెల్స్‌ను తొలగిస్తుంది. ముఖంపై మచ్చలు తొలగిపోతాయి
పసుపుతో నిమ్మరసం
వయస్సు కంటే ముందే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తుంటే పసుపులో కొద్దిగా నిమ్మరసం పిండి ముఖానికి రాయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు తొలగిపోతాయి. గీతలు, చారలు పోతాయి. నిమ్మలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు దోహదం చేస్తాయి. చర్మానికి నిగారింపును ఇస్తాయి.
పసుపుతో పెరుగు
పసుపు, పెరుగు మిశ్రమం చర్మానికి చాలా ప్రయోజనకరం. ఇది బెస్ట్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్లు, ల్యాక్టిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. నిర్జీవంగా ఉన్న చర్మ కణాల్ని యాక్టివ్ చేస్తాయి.
పసుపులో తేనె
తేనెలో పసుపు కలిపి ఆప్లై చేస్తే చాలా లాభాలున్నాయి. తేనె ముఖాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పింపుల్స్, ఎలర్జీ సమస్యలకు చెక్ పెడతాయి. చర్మంపై తేమ కొనసాగేలా చేస్తుంది. ముఖాన్ని మృదువుగా ఉంచుతుంది.