New Year Travel Plan: కొత్త సంవత్సరం వేడుకలు ప్లాన్ చేసేందుకు అద్భుతమైన ప్రాంతమిదే, ఖర్చు కేవలం 5 వేలే

కసోల్‌లో ప్రవహించే నది పార్వతీ నది. కసోల్‌లో నది ఒడ్డున దట్టమైన అడవుల్లో బాగా ఎంజాయ్ చేయవచ్చు. కసోల్‌లో ట్రాకింగ్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడి భౌగోళిక వాతావరణం అందర్నీ ఆకట్టుకుంటుంది.

కసోల్‌ను మినీ ఇజ్రాయిల్ అని కూడా పిలుస్తారు. కసోల్‌కు పెద్దసంఖ్యలో ఇజ్రాయిల్ పౌరులు వస్తుంటారు. కసోల్‌లో ఇజ్రాయిల్ సంస్కృతి కన్పిస్తుంది. అడ్వెంచర్స్ ఇష్టపడేవారికి కసోల్ అత్యంత అనువైన ప్రదేశం.

కసోల్‌లో హోటల్‌లో స్టే చేసేందుకు 500 నుంచి 1000 రూపాయలు రోజుకు ఉంటుంది. కసోల్ సమీపంలో మలాయా, ఖీర్‌రాంగా కూడా మంచి పర్యాటక ప్రాంతాలు.
కొత్త సంవత్సరం వేడుకల్ని కసోల్‌లో బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఢిల్లీ నుంచి కసోల్ చేరుకోవడం చాలా సులభం. ఢిల్లీ నుంచి కసోల్‌కు బస్సులో కేవలం 500 రూపాయల్లో వెళ్లవచ్చు. ఢిల్లీ నుంచి కసోల్ బస్సు ద్వారా 12 గంటల ప్రయాణం ఉంటుంది. ఫ్లైట్ ద్వారా వెళ్లాలంటే..ఢిల్లీ నుంచి కులూకు ఫ్లైట్ ద్వారా వెళ్లి..అక్కడి నుంచి కసోల్ వెళ్లాల్సి వస్తుంది.
కొత్త సంవత్సరం 2023 వేడుకలకు కసోల్ ఓ అద్భుతమైన, అందమైన డెస్టినేషన్ కాగలదు. తక్కువ ఖర్చుతో ఫుల్ ఎంజాయ్‌మెంట్ లభించే ప్రాంతమిది. కసోల్ వాతావరణం మీ మనస్సు గెల్చుకుంటుంది. కసోల్ అందమైన లోయలు మళ్లీ మళ్లీ రమ్మనేలా చేస్తాయి.