Best Pension Scheme: 4.67 కోట్ల ఉద్యోగులకి గుడ్ న్యూస్.. ఇక నుంచి నెలకు రూ.1.5 లక్షల పెన్షన్.. ఎలా పొందాలంటే?
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టొచ్చు. అలాగే పదవి విరమణ పొందిన తర్వాత దీని ద్వారా ఏకంగా రూ.1 లక్ష నుంచి రూ.1.7 లక్షల వరకు పెన్షన్ కూడా పొందవచ్చు. అయితే 25 ఏళ్ల ఓ యువ ఉద్యోగి పదవి విరమణ తర్వాత రూ.1 లక్షకు పైగా పెన్షన్ పొందడానికి ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రస్తుతం చాలామంది యువత రిటైర్మెంట్ తర్వాత రూ.1.5 లక్షకు పైగా పెన్షన్ పొందాలని వివిధ రకాల స్కీమ్స్ లలో డబ్బులు పెట్టుబడిగా పెడుతున్నారు. వాటికంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. ఇందులో కేవలం 35 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే బంపర్ లాభాలు పొందుతారు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో భాగంగా రూ.6.75 లక్షలు రిటైర్మెంట్కు కార్పస్ ప్లాన్ చూజ్ చేసుకుంటే దాదాపు ప్రతి నెల కూర్చొని రూ.1.5 లక్షలు పెన్షన్ గా పొందవచ్చు. అయితే ఈ స్కీమ్ లో భాగంగా మొత్తం అంటే 40 శాతం వరకు పెన్షన్ కోసమే పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.
ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడిగా పెట్టిన డబ్బులు 60 శాతం వరకు ఎలాంటి టాక్స్ లేకుండా విత్ డ్రా చేసుకునే ప్రత్యేకమైన అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. అంతేకాకుండా మరెన్నో ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
25 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ పథకంలో ప్రతినెల దాదాపు రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే 60 సంవత్సరాల తర్వాత దాదాపు ప్రతినెల రూ.1.5 లక్షల పెన్షన్ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీరు పెట్టుబడి పెట్టిన దానికి 12 శాతం వరకు రిటర్న్స్ వస్తాయి.
ఇలా మీరు పెట్టిన పెట్టుబడి దాదాపు మొత్తం రూ.25.2 లక్షలకు పైగా అవుతుంది. ఇక మెచ్యూరిటీ కి సంబంధించిన వ్యాల్యూ వివరాల్లోకి వెళితే.. అది రూ.6.74గా ఉంటుంది. ఇందులో దాదాపు 40 శాతం యాన్యూటీ ప్లాన్ కొనసాగే అవకాశాలున్నాయి. ఇక మిగిలిన రూ.4 లక్షలు కూడా ఎలాంటి టాక్స్ లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇలా అన్ని విత్ డ్రా చేసుకున్నప్పటికీ ప్రతినెల రూ.1.48 లక్షలకు పైగా పెన్షన్ లభిస్తుంది. అయితే ఈ పెన్షన్ అనేది యాన్యూటీ ప్లాన్ పై కూడా ఆధారపడి ఉంటుంది. దీన్నిబట్టి పెన్షన్ రిలీజ్ అవుతుంది.