Belly Fat: ఈ గింజలను తింటే బెల్లీ ఫ్యాట్ కరిగి సన్నని నడుము పొందడం ఖాయం!
బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారికి గసగసాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే గుణాలు శరీర బరువుతో పాటు పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వీటిని ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది. వీటిని ఆహారాల్లో ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గోరు వెచ్చని పాలలో గసగసాలు కలుపుకుని తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు కండరాలను దృఢంగా చేయడమే కాకుండా శరీర బరువును సులభంగా తగ్గిస్తుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది.
బరువు తగ్గే క్రమంలో వినియోగించే డైట్‌లో ఓట్ మీల్‌లో ఈ గసగసాలు కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించవచ్చు. ఇందులో ఉండే మూలకాలు బెల్లీ ఫ్యాట్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
మార్కెట్‌లో లభించే గసగసాల సిరప్‌ను రోజు తీసుకునే డ్రింక్స్‌లో కలుపుకుని తాగితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
గసగసాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని తీసుకోవడం బెల్లీ ఫ్యాట్, బరువు నుంచి రెండు వారాల్లో ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మధుమేహం నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.