Charging Tips: మీ ఫోన్ ఛార్జింగ్‌లో ఈ టిప్స్ పాటించండి, లేకపోతే జేబుకు గుల్లే
చాలా సమయాల్లో త్వరగా ఛార్జింగ్ ఎక్కాలనే ఉద్దేశ్యంతో ఫాస్ట్ ఛార్జింగ్ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటారు. కానీ ఈ యాప్స్ బ్యాక్‌గ్రౌండ్ లో పనిచేస్తుంటాయి. దాంతో బ్యాటరీ త్వరగా అయిపోతుంటుంది. అందుకే అలా చేయకూడదంటున్నారు నిపుణులు.
చాలా సందర్బాల్లో కవర్‌తో కలిపి ఛార్జింగ్ పెడుతుంటారు. ఇలా చేయకూడదు. కవర్‌తో పాటు ఛార్జింగ్ పెడితే బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా బ్యాటరీ పాడయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఛార్జింగ్ పెట్టేటప్పుడు కవర్ తీసేయడం మంచిది.
మీ ఫోన్ బ్యాటరీ 20 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే బ్యాటరీపై ఒత్తిడి పడదు. బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
అస్తమానూ ఛార్జింగ్ పెట్టకూడదు. అంటే చాలామంది 80-90 శాతం బ్యాటరీ ఉన్నా సరే..ఛార్జింగ్ పెడుతుంటారు. ఇది మంచిది కాదని నిపుణుల అభిప్రాయం. మరెప్పుడు పెట్టుకోవాలి..
మీ ఫోన్ బ్యాటరీ పాడవకుండే ఉండేట్టు చూసుకోవాలి. ఎక్కువకాలం మన్నిక ఉండాలంటే ఎప్పుడూ ఒరిజినల్ ఛార్జర్‌తోనే ఛార్జింగ్ పెట్టుకోవడం అత్యుత్తమ మార్గం. అలాకాకుండా ఏదో ఒక లోకల్ ఛార్జర్‌తో ఛార్జింగ్ పెట్టుకుంటే..అది మీ ఫోన్ బ్యాటరీపై ప్రభావం చూపిస్తుంది. తరచూ ఇలా చేయడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ పాడైపోతుంది.