Best Hill Station: మనాలీతో పాటు మరో అందమైన హిల్ స్టేషన్ దృశ్యాలు
వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ హిల్ స్టేషన్స్ సందర్శిస్తుంటారు. వాతావరణం ప్రశాంతంగా, చల్లగా ఉండటం వల్ల వేసవి తాపం తీర్చుకుంటారు.
హిల్ స్టేషన్ అనగానే సాధారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ గుర్తొస్తుంది అందరికీ. అత్యంత ప్రాచుర్యం కలిగిన ప్రాంతమిది. ఇప్పుడు మనాలీ కాకుండా మరో అందమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ నుంచి దాదాపు ఓ గంట దూరంలో ఉన్న అందమైన లయ ప్రాంతమిది. భయంకరమైన మే ఎండల్లో కూడా ఇక్కడి కొండ ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 3-6 డిగ్రీలుంటుంది.
ఈ ప్రాంతం పేరు మఢీ. అయితే మఢీ సందర్శించాలంటే ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. మనాలీ నుంచి మఢీకు ట్యాక్సీ సర్వీసు ఉంటుంది. సొంత కారులో కూడా వెళ్లవచ్చు.
మడీ వెళ్లే దారిలో అందమైన రోడ్లు, మంచుతో కప్పుకున్న కొండలు కన్పిస్తాయి. ఇవి మీ ప్రయాణాన్ని అందమైన అనుభూతిగా మారుస్తాయి. మార్గమద్యమంతా అందమైన సుందరమైన ప్రాంతాలు కన్పిస్తాయి.
మఢీ వెళ్లేటప్పుడు దారిలో మ్యాగీ పాయింట్స్ చాలా కన్పిస్తాయి. ఇక్కడ కాస్సేపు ఆగి టీ లేదా మ్యాగీతో ఎంజాయ్ చేయవచ్చు.
మఢీ వెళ్లాలంటే మనాలీలో హోటల్ తీసుకుని స్టే చేయాల్సి ఉంటుంది. మనాలీ నుంచి మఢీ కేవలం ఓ గంట దూరమే. ఉదయం బయలుదేరి వెళ్లి సాయంత్రానికి తకిరిగి వచ్చేయవచ్చు.