Top 5 Places: వేసవి సందర్శనీయ 5 అందమైన ప్రాంతాలు
రాజధరీ-దేవధరీ జల పాతాలు
ఇవి రెండు అందమైన జలపాతాలు. వారణాసికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. చందౌలీ, నాగౌడ్ అడవుల్లో ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి అందాలు చాలా ప్రసిద్ధి
లఖానియా దరి
ఈ ప్రాంతం వారణాసి నుంచి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందమైన జలపాతాలతో ఉండే ఏజెన్సీ ప్రాంతమిది. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ట్రాకింగ్ కూడా చేయవచ్చు
చునార్ కోట
ఈ కోట గంగా నదీ తీరాన ఓ కొండపై ఉంది. ఈ కోట 12వ శతాబ్దానికి చెందింది. ఇక్కడ చారిత్రాత్మక కట్టడాలు చాలా ఉన్నాయి. వారణాసికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వింధ్యాచల్
ఇదొక పవిత్ర సందర్శనీయ క్షేత్రం. వారణాసికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతమిది.
సారనాథ్
ఇది బౌద్ధధర్మంలో అత్యంత మహత్యం కలిగిన ప్రాంతం. బుద్ధుడికి తొలి ఉపదేశం లభించిన ప్రాంతంగా చెబుతారు. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సారనాథ్‌లో తిరిగేందుకు చాలా సందర్శనీయ ప్రాంతాలున్నాయి.