Heart Health Tips: ఈ ఐదు టిప్స్ పాటిస్తే గుండె పదికాలాలు పదిలం, ఎలాగంటే
అర్జున చెట్టు బెరడు మరో అద్బుతమైన ఔషధమని చెప్పవచ్చు. గుండె వ్యాధులకు ఇది సంజీవనిలా పనిచేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది.
మద్యం-స్మోకింగ్
మద్యం-స్మోకింగ్ కారణంగా గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది. చలికాలంలో గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఈ రెండు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
ఆకు కూరలు
గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు పొటాషియం చాలా అవసరం. బ్లడ్ ప్రెషర్, చెడు కొలెస్ట్రాల్ రెండూ తగ్గుతాయి. దీనికోసం పాలకూర వంటి ఆకుకూరలు డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. ఫలితంగా గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని సేవించడం వల్ల చాలా రకాల వ్యాధులు దూరం చేయవచ్చు. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వ్యాయామం
ఆరోగ్యవంతమైన శరీరం కోసం రోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం. ముఖ్యంగా చలికాలంలో తప్పకుండా చేయాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా ముఖ్యం.