Bhagyashree Fitness Secret : 54ఏళ్ల వయస్సులోనూ అదే అందం..ప్రభాస్ తల్లి బ్యూటీ సీక్రెట్ తెలిస్తే పరేషాన్ అవుతారు..!
Bhagyashree: ప్రేమపావురాలు సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మైనే ప్యార్ కియా మూవీతో భాగ్యశ్రీ ఒక్కసారి స్టార్ డమ్ అయ్యింది. ఆతర్వాత ఆమె ఎక్కువగా సినిమాల్లో నటించకపోయినా..ఆ సినిమాతో వచ్చిన గుర్తింపు ఇప్పటికీ అభిమానులు గుండెల్లో అలాగే ఉండిపోయింది. భాగ్యశ్రీకి ఇప్పుడు 54ఏళ్లు. అయినా కూడా ఆమెలో ఏమాత్రం అందం తగ్గలేదు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉంది. అందం, ఫిట్‌నెస్ తో అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. భాగ్యశ్రీ ఇన్ స్టాగ్రామ్ చూస్తే అందులో ఫిట్‌నెస్, బ్యూటీ టిప్స్ గురించే ఉంటుంది. ఆమె వయస్సు 54ఏళ్లు అంటే ఎశరూ నమ్మరు. అందుకే నెటిజన్లు భాగ్యశ్రీ మీ బ్యూటీ సీక్రెట్ ఏంటీ అడుగుతున్నారు. అంతేకాదు భాగ్యశ్రీ రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ కు తల్లిగా నటించిన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. భాగ్యశ్రీ తాను ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తారో తెలిపారు.
ఓట్స్ , పాలు, తేనె: భాగ్యశ్రీ తన చర్మ సౌందర్యానికి కారణం ఏంటో చెప్పారు. గ్రైండ్ చేసిన ఓట్స్ కు పాలు, తేనె కలిపి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేసుకుని ..ఎండిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటారట. ఓట్స్ లో డెడ్ స్కిన్ తొలగించే లక్షణం ఉంటుంది. పాలు చర్మాన్ని స్మూత్ గా ఉంచుతాయి. తేనేలోని యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి అలసిపోయిన చర్మాన్ని కొద్దిసేపట్లోనే ముఖానికి మెరుపునిస్తాయి.
యోగాతో అందం, ఆరోగ్యం; బాలీవుడ్ అలనాటి అందాల నటి భాగ్యశ్రీ వెండితెరపై ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడిచిపోయిన నేటికీ చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె బ్యూటీ సీక్రెట్ వెనుక ముఖ్యంగా యోగా సాధన కూడా ప్రధానంగా ఉందని చెబుతుంటారు ఆమె ప్రతిరోజు ఉదయం లేవగానే రెండు గంటల పాటు యోగ సాధన చేస్తారు.
డైట్ లో జాగ్రత్తలు: అలాగే అలాగే భాగ్యశ్రీ తన డైట్ విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటారు. ఆమె తన డైట్ లో ఎలాంటి నూనెలో వేయించిన ఆహార పదార్థాలు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. అంతేకాదు కొవ్వును పెంచే డైరీ ఉత్పత్తులను కూడా ఆమె తన ఆహారంలో భాగం చేసుకోరు.
నాట్య సాధన: భాగ్యశ్రీ తన ఫిట్ నెస్ లో భాగంగా స్వతహాగా డాన్సర్ అవడంతో ప్రతిరోజు నాట్య సాధన చేస్తారు. ఇది కూడా ఆమెను ఉత్సాహంగాను అందంగానే ఉంచేందుకు దోహదపడుతోంది. అందుకే ఆమె ప్రతిరోజు నాట్య సాధన చేయడానికి ఏమాత్రం బద్ధకించరు అని తెలుసుకోవచ్చు.
ధ్యానంతో శారీరక, మానసిక సౌందర్యం: భాగ్యశ్రీ తన ఒత్తిడిని తొలగించుకునేందుకు ఆమె ధ్యానం చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని తెలుస్తోంది. ధ్యానం చేయడం వల్ల ఆమె మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక సౌందర్యం కూడా పెంచేందుకు తోడ్పడుతుందని ఆమె భావిస్తారు.
మంచినీటితో చర్మం నిగారింపు: భాగ్యశ్రీ తన చర్మ సౌందర్యాన్ని చర్మ కాంతిని కాపాడుకునేందుకు రెగ్యులర్ గా మంచినీరు ఎక్కువగా తాగడానికి ప్రిఫర్ చేస్తారు. ఇందులో భాగంగా ఆమె ప్రతిరోజు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల మంచినీరు తాగుతారు. తద్వారా ఆమె చర్మం ఎప్పుడూ కాంతివంతంగా నిగారింపుతో ఉంటుందని భావిస్తారు.