Bhanu Saptami: 52 ఏళ్ల తర్వాత భాను సప్తమి వేళ అరుదైన యోగం.. ఈ రాశులవారు బంపర్ జాక్ పాట్ కొట్టినట్లే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ధనుర్మాసంలో వచ్చే.. భాను సప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్తుంటారు. భాను సప్తమి అనేది సూర్యుడికి సంబంధించింది. ఈరోజున సూర్యుడ్ని ఈ కింది విధంగా ఆరాధిస్తే..జాతకంలో ఉన్న దోషాలన్ని దూరమైపోతాయి.
అదే విధంగా దాదాపు.. 52 ఏళ్ల తర్వాత భాను సప్తమి అంటే.. డిసెంబరు22 ఆదివారం రోజున అరురైన యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శనిదేవుడు ఒకే సరళ మీదకు రానున్నారంట. అదే విధంగా ఈ రెండు గ్రహాలు కూడా ఒకే రాశిలో అంటే.. కన్యలో ఏర్పడి తమ ప్రభావంను చూపబోతున్నాయంట. దీని ప్రభావం ద్వాదశ రాశులపై పడనుంది.
భానుసప్తమి ప్రభావం వల్ల సింహారాశివారికి అనుకొని విధంగా ఆదాయం సమకూరుతుంది. సొంతింటి కల సాకారం అవుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కన్య రాశి వారికి.. కోర్టుకేసుల్లో ఉన్న గొడవల్లో విజయం సాధిస్తారు. భార్య తరపు ఆస్తులు సొంతమౌతాయి. ఇంట్లో కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి.
మేష రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఉన్నత చదువుల కోసం కొత్త ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.