Bharat Bandh: రైతుల దేశవ్యాప్త బంద్‌కు కేసీఆర్ మద్దతు
డిసెంబర్ 8న జరగబోయే భారత్ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సహా..ఆర్జేడీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్ పీ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, డీఎంకే పార్టీలు మద్దతిచ్చాయి. ఇప్పుడు టీఆర్ఎస్ సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
దాదాపు 4 గంటల సేపు చర్చలు జరిగినా...ఎటువంటి ఫలితం రాలేదు. ఈ ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు పట్టుబట్టారు. కేంద్రం మాత్రం కొంత సమయం కోరింది. తుది నిర్ణయం గానీ, నిర్దిష్ట ప్రతిపాదన కోసమైనా ఈ నెల 9 వరకూ గడువు కోరింది.
రైతుల పోరాటం న్యాయబద్ధమైందని..డిమాండ్స్ ఆమోదయోగ్యమని కేసీఆర్ తెలిపారు. రైతుల వెంట నిలవాల్సిన అవసరముందని కేసీఆర్ తెలిపారు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్రమంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నారు.
భారత్ బంద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రైతుల సమ్మెకు మద్దతు తెలిపిన కేసీఆర్..ఇప్పుడు బారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతుల సమ్మె నడుస్తోంది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈనెల 8న అఖిల భారత రైతు సంఘాలు భారత్ బంద్ తలపెట్టాయి.