PSU Stock: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.10లక్షలు మీకు దక్కేవి...ఏ స్టాక్ అంటే..?
Stocks to buy: మీరు స్టాక్ మార్కెట్లో మంచి రాబడి కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఎలాంటి స్టాక్స్ ఎంపిక చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారా.. ఈ నేపథ్యంలో మీరు మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్ ను ఎంపిక చేసుకుంటే చక్కటి రాబడి పొందవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఏరోస్పేస్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో అతిపెద్ద సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ తన ఇన్వెస్టర్లకు గడచిన సంవత్సర కాలంగా రెండింతలల ఆదాయాన్ని అందించింది.
ఈ స్టాక్ గడచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు 842 శాతం లాభాన్ని అందించిందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆగస్టు 2019 వ సంవత్సరంలో ఈ స్టాక్ ధర కేవలం 32 రూపాయలు మాత్రమే కానీ ప్రస్తుతం ఈ స్టాక్ ధర 300 రూపాయలు పెరిగింది. అంటే మీకు ఒక్కో షేర్ విలువ దాదాపు పది రెట్లు పెరిగింది అని అర్థం. ఉదాహరణకు మీరు ఈ కంపెనీలో ఐదు సంవత్సరాల క్రితం ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం వాటి విలువ 2024 వ సంవత్సరం ఆగస్టు 16 నాటికి దాదాపు పది లక్షల రూపాయలు పెరిగింది అని అర్థం.
ఇక ఈ భారత ఎలక్ట్రానిక్స్ సంస్థ విషయానికి వస్తే, 1954వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సంస్థగా పేరు సంపాదించుకుంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న 16 పిఎస్‌యు కంపెనీలలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ఒకటి. ఈ కంపెనీకి నవరత్న హోదా కూడా ఉంది. 1956 లో కమ్యూనికేషన్ పరికరాల తయారీ ద్వారా దీని ఆపరేషన్ ప్రారంభించింది.
1964 లోనే ఆల్ ఇండియా రేడియో కోసం రేడియో ట్రాన్స్ మీటర్లను సైతం తయారు చేసింది. ఇక 1966 నుంచి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలోకి కూడా ప్రవేశించి రాడారులను తయారు చేసింది. అలాగే 1967లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లో తయారీ కూడా ప్రారంభించింది. 1970లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బ్లాక్ అండ్ వైట్ టీవీ లకు పిక్చర్ ట్యూబులను సైతం తయారు చేసింది. అలాగే ఎక్స్ రే పరికరాలు, మైక్రోవేవ్ ట్యూబ్‌లను సైతం తయారుచేసింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సైతం ఈ సంస్థ తయారు చేస్తుంది. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ రాడార్లు ఆటో ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు, డిఫెన్స్ రంగానికి చెందిన మిస్సైల్స్ సైతం ఈ సంస్థ భాగస్వామ్యంతో తయారుచేస్తోంది. వీటిలో ముఖ్యంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తో కలిసి ఆకాశ్ క్షిపణిని ఈ సంస్థ తయారు చేసింది.
అలాగే వైమానిక దళం కోసం c41 వ్యవస్థను రూపొందించింది ఫైనాన్స్ విషయానికి వచ్చినట్లయితే ఏటా 19860 కోట్ల రాబడి లభిస్తుంది. అలాగే కంపెనీకి నికర ఆదాయం విషయానికి వస్తే 4,020 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ కంపెనీ ఆస్తుల విలువ రూ. 39,526 కోట్లుగా ఉంది. సంస్థ ఈక్విటీ విలువ 16,344 కోట్లుగా ఉంది.