Big Alert: బిగ్ అలెర్ట్.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ 2 జిల్లాల్లో భారీ వర్షాలు..
గత నెల నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేవ్‌వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీని ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా పడింది.
ఈ సందర్భంగా ఇళ్లలోకి నీళ్లు చేరడం, నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందులు పడిన ఘటనలు చూశాం. ఇదిలా ఉండగా తాజాగా నేడు మరోసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
ఈరోజు ఏర్పడనున్న అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఆ తర్వాత తుఫానుగా మారుతుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి.
ముఖ్యంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అవ్వచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రలో కూడా చలి తీవ్రత పెరుగుతుంది.
తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చలితీవ్రత పెరిగింది. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సైతం హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటే రాత్రుళ్లు చలి తీవ్రత పెరుగుతోంది.