EPF: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..డిసెంబర్ 15లోపు ఈ పని పూర్తి చేయండి..లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్
EPFO New Rules: మీరు PF చందాదారులా? అయితే మీకో బిగ్ అలర్ట్. దీని గురించి మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎప్పటికప్పుడు అనేక కొత్త నిబంధనలను రూపొందిస్తూ, ప్రస్తుతం ఉన్న నిబంధనలలో మార్పులు చేస్తుంది. EPF సభ్యుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఇటువంటి మార్పులు చేసింది.
గతంలో UAN, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ నవంబర్ 15గా ఉంది. కానీ చాలా మంది ఉద్యోగులు ఆ గడువును పెంచాలని విజ్నప్తి చేశారు. దీంతో గడువును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. ఈ పనిని పూర్తి చేయడానికి EPF సబ్‌స్క్రైబర్‌లకు EPFO మరో అవకాశం ఇచ్చింది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అమలు కోసం గడువును పొడిగించింది. ఇందుకోసం ఈ ఉద్యోగులు డిసెంబర్ 15లోగా తమ యూఏఎన్, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. అంతకుముందు దాని చివరి తేదీ నవంబర్ 30. కానీ చాలా మంది ఉద్యోగులు దీన్ని మిస్సయ్యారు. EPFO వారికి మరో అవకాశం ఇచ్చింది.
UAN యాక్టివ్‌గా ఉంది అంటే యాక్టివ్‌గా ఉన్నందున ఉద్యోగులు ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చని EPFO తెలిపింది. కొత్త ఉద్యోగులందరి UAN, బ్యాంక్ ఖాతాలను నిర్ణీత సమయంలోగా అప్‌డేట్ చేయాలని యాజమాన్యాలు / సంస్థలకు సంస్థ సూచించింది.
పూర్తి వివరాలతో UAN నంబర్‌ను ఆధార్, బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన తర్వాత మాత్రమే పథకం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) సాధ్యమవుతుంది. ప్రస్తుతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన ఉద్యోగుల సమాచారం మాత్రమే అప్ డేట్ చేస్తోంది. తదుపరి దశలో, పాత ఉద్యోగులు కూడా వారి వివరాలను అప్‌డేట్ చేయాలి.
ముందుగా EPFO పోర్టల్‌కి వెళ్లండి ( https://www.epfindia.gov.in/ ).ముఖ్యమైన లింక్‌ల క్రింద యాక్టివేట్ UAN లింక్‌పై క్లిక్ చేయండి. UAN, ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ఉద్యోగులు తమ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానించారని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత ఆధార్ OTP ధృవీకరణను అనుమతించండి. మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌పై OTP పొందడానికి 'వెరిఫికేషన్ పిన్ పొందండి'పై క్లిక్ చేయండి. యాక్టివేషన్‌ను పూర్తి చేయడానికి OTPని నమోదు చేయండి. విజయవంతమైన యాక్టివేషన్ తర్వాత పాస్‌వర్డ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది.