Traffic Alert: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. రేపు ఈ మార్గాల్లో రాకపోకలు బంద్
చిక్కుకుంటే నరకమే: ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఎంత చిరాకే వాహనదారులకు తెలిసిందే. సమయం వృథా.. ఎన్నో పనులు వాయిదా పడుతాయి.
రాకపోకలపై ఆంక్షలు: హైదరాబాద్‌లో తరచూ ఏదో కార్యక్రమంతో వాహనాల దారి మళ్లింపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి పలు మార్గాల్లో రాకపోకలపై నియంత్రణ విధించారు.
రాష్ట్రపతి పర్యటన: హైదరాబాద్ నగరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు విధించారు.
స్నాతకోత్సవం: నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవానికి హాజరవుతుండడంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
రాష్ట్రపతి షెడ్యూల్: ఢిల్లీ నుంచి బయల్దేరే రాష్ట్రపతి ఉదయం 11.50 గంటలకు హైదరాబాద్ శివారులోని హకీంపేట ఎయిర్ బేస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.20కి నల్సార్ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు.
మరో షెడ్యూల్: మధ్యాహ్నం 3.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని భారతీయ కళా మహోత్సవ్ 2024ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.45కు హకీంపేట నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.
దారి మళ్లింపు: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఉదయం 9 నుంచి బేగంపేట, పీఎన్‌టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ర్టపతి నిలయం ప్రాంతాల్లో దారి మళ్లింపులు ఉంటాయి.
ట్రాఫిక్ పోలీస్ సూచన: ఆ మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ సూచించారు.