Pension Hike News: పెన్షనర్లకు అదిరిపోయే గిఫ్ట్, వాళ్లందరికీ ఇకపై డబుల్ పెన్షన్ ఎవరికెంత పెన్షన్
80 ఏళ్ల దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. సూపర్ సీనియర్ సిటిజన్లు అందరికీ అదనపు పెన్షన్ అందించనుంది. ఈ మేరకు తాజాగా పెన్షన్ మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేసింది. ఏ వయస్సు వారికి ఎంతెంత పెన్షన్ పెరగనుందో వివరించింది. అంతేకాకుండా పెన్షన్ చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేసింది.
సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021 రూల్ నెంబర్ 44 ప్రకారం 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్, డీఏ రెండూ లభిస్తాయి. 80 ఏళ్లు దాటినవారికి 20 శాతం నుంచి 100 శాతం వరకూ పెన్షన్ అదనంగా లభించనుంది
సూపర్ సినియర్ సిటిజన్లలో కూడా వయస్సుని బట్టి అంటే 80 ఏళ్ల నుంచి 100 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగినవారికి వయస్సుని బట్టి అదనపు పెన్షన్ ఎంతనేది నిర్ణయించింది. వయస్సువారీగా లభించే అదనపు పెన్షన్ వివరాలు ఇలా ఉన్నాయి
80-85 ఏళ్ల వయస్సు కలిగిన సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు ప్రాధమిక పెన్షన్‌లో 20 శాతం అదనంగా లభిస్తుంది. ఇక 85-90 ఏళ్లు కలిగిన పెన్షనర్లకు 30 శాతం అదనంగా వస్తుంది.
90-95 ఏళ్ల వయస్సు కలిగిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రాధమిక పెన్షన్ నుంచి 40 శాతం అదనంగా లభిస్తుంది. అదే 95-100 ఏళ్ల వరకుంటే 50 శాతం అదనంగా పెన్షన్ లభిస్తుంది. అంటే 10 వేలు పెన్షన్ వచ్చేవారికి 15 వేలు అందుతుంది. ఏకంగా 5 వేలు పెరుగుతుంది
100 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సుంటే ఆ పెన్షనర్లకు 100 శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది. అంటే పెన్షన్ రెట్టింపు అవుతుంది. ఇదే గరిష్టం. అంటే నెలకు 10 వేలు పెన్షన్ పొందుతుంటే ఇకపై 20 వేలు పొందుతారు
పెన్షన్ పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు అన్ని బ్యాంకులు, సంబంధిత శాఖల్లో కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అన్ని బ్యాంకులు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.