Bigg Boss 8 Telugu: గంగవ్వకు గుండెపోటు..?.. ఆందోళనలో నాగార్జున, బిగ్ బాస్ కంటెస్టెంట్‌లు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గంగవ్వకు గుండె పోటు వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఇదిలా ఉండగా.. ఇటీవల బిగ్ బాస్ 8 సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది.
మొత్తంగా 14 మంది కంటెస్టెంట్ లతో బిగ్ బాస్ 8 ప్రొగ్రామ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఈ ప్రొగ్రామ్ స్టార్ట్ అయిన 7 వారాలలో 8 మంది కంటెస్టెంట్ లు ఎలిమినెట్ అయిన సంగతి తెలసిందే.
అంతే కాకుండా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో మరొకవైపు ఆరవ వారం వైల్డ్ కార్డు ద్వారా ఎనిమిది మంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హౌస్ కంటెస్టెంట్స్, ఇటు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ మధ్య నువ్వా.. నేనా అన్న విధంగా పోటీ నెలకొన్నట్లు తెలుస్తొంది.
గంగవ్వతో పాటు, బిగ్ బాస్ హౌస్ లోకి.. అవినాష్, గౌతమ్, మెహాబూబ్,పావని, తేజ, రోహినిలు ఎంట్రీ ఇచ్చారు. అయితే.. వీరిలో గంగవ్వ సీజన్ 4 కంటెస్టెంట్. ఈ క్రమంలో ఆమె కొన్ని రోజులుగా బిగ్ హౌస్ లో చాలా డల్ గా ఉంటున్నట్లు తెలుస్తొంది.
గతంలో కూడా వయస్సు రీత్యా సమస్యలతో ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతానని కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ నాగార్జున ఆమెకు మంచి ట్రీట్మెంట్ అందించారు. అంతేకాకుండా.. గంగవ్వకు మంచి ఇల్లును కూడా కట్టించి ఇచ్చారు.
అయితే.. అనూహ్యాంగా బిగ్ బాస్ 8 సీజన్ లో మళ్లీ అడుగుపెట్టిన గంగవ్వ కొన్నిరోజులుగా చాలా డల్ గా ఉంటున్నట్లు తెలుస్తొంది. దీంతో నిన్న రాత్రి గంగవ్వకు గుండెపోటు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు భయపడిపోయారంట. గంగవ్వకు అక్కడున్న మెడికల్ టీమ్ మాత్రం మెరుగైన వైద్యసేవలు అందించారంట. దీనిపైన ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.