Big Breaking: హైడ్రా సంచలనం.. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఇళ్లు నిర్మించుకొని ఉన్న యజమానులకు భారీ ఊరట..

Sun, 08 Sep 2024-3:47 pm,

ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులను ఆక్రమించిన నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తూనే ఉంది. మొదటగా టాలివుడ్‌ హీరో నాగర్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మాణం పూర్తిగా నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇది బఫర్ జోన్‌లో నిర్మించారని ఈ కూల్చివేతలు చేపట్టారు. ఆ తర్వాత హిమాయత్‌ నగర్‌, రాంనగర్‌ వైపుగా బుల్డోజర్లు దూసుకెళ్లాయి.  

తాజాగా ఈరోజు ఉదయం నుంచి ఒకవైపు జయభేరీ సంస్థ అధినేత అయిన టాలివుడ్‌ సీనియర్‌ నటడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్‌కు నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియ డిస్ట్రిక్‌లోని ఓ సంస్థ రంగలాల్‌ కుంట ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్ లో నిర్మించారని వాటిని 15 రోజుల గడువులో కూల్చివేయాలని హెచ్చరించింది. ఈ క్రమంలో మురళీ మోహన కూడా తాను ఏ అక్రమాలకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు.  

అయితే, మాదాపూర్‌లోని సున్నం చెరువు, కత్వా చెరువు వైపుగా అక్రమ కట్టడాలను కూల్చి వేస్తు వెళ్లారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు వ్యతిరేకిస్తూ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని కూడా బెదిరించారు. తాము పిల్లాపాపలతో ఉన్నాం ఎక్కడికి వెళ్లాలి? అని గగ్గోలు పెట్టుకున్నారు. నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు ఏంటి? అని తీవ్రంగా ప్రతిఘటించారు,అడ్డుపడ్డారు. దీంతో ఈరోజు ఒక్కసారిగా హైదరాబాద్‌లో హైటెన్షన్‌ మొదలైంది.  

కూల్చివేయద్దంటూ అక్కడి నివాసితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాతే నిర్మాణాలు చేపట్టామన్నారు. ఎంత కష్టపడి ఈ ఇళ్లు కట్టుకున్నాం వదిలేయాలంటూ వేడుకుంటున్న దృశ్యాలు కంటతడి పెట్టించాయి. ఒక విధంగా రేవంత్‌ ప్రభుత్వాన్ని కూడా వారు నిలదీశారు. రాజకీయ నాయకులను డబ్బున్నవారిని వదిలేసి పేదవారిపై ఏంటి ప్రతాపం అని ప్రశ్నించారు.  

ఈ నేపథ్యంలో తాజాగా హైడ్రా కూల్చివేతలపై సంచలన నిర్ణయం తీసుకుంది. విస్త్రతంగా ఈ కూల్చివేతలపై అన్ని వర్గాల వైపు నుంచి నిరసనలు వ్యక్తం అవ్వడంతో వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్లో ఇప్పటికే ఇళ్లు నిర్మించిన ఇళ్లను కూల్చివేయబోమని రంగనాథ్‌ వివరణ ఇచ్చారు. కొత్త నిర్మాణాలు చేపడితే మాత్రం ఊరుకునేది లేదని కేవలం వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని కూలుస్తున్నటలు చెప్పారు.  

ఈ తాజా ప్రకటనతో ఇంటి యజమానులకు భారీ ఊరట లభించింది. అయితే, మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అందుకే వాటిని కూల్చివేస్తున్నట్లు ప్రకటించారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link