School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. నవంబర్ 13 నుంచి వరుసగా 6 రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటన..!
గత నెలలో అక్టోబర్ 2న దసరా పండుగ సందర్భంగా కూడా దాదాపు 15 రోజులపాటు స్కూళ్లకు సెలవులు వచ్చాయి. అంతేకాదు కేవలం 15 రోజుల పాటే బ్యాంకులు కూడా పనిచేశాయి. మన దేశంలో దసరా దీపావళి పండుగలు అంగరంగ వైభవంగా చేసుకుంటారు అందుకే ఇన్ని సెలవులు కూడా వచ్చాయి.
దీంతో పాటు భారీ వర్షాలు తుఫానులు కూడా రావడంతో భారీగానే స్కూలు కాలేజీలకు సెలవులు వచ్చాయి. ఇదిలో ఉండగా అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా సెలవు వచ్చింది అంతేకాదు నవంబర్ ఫస్ట్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో దీపావళి జరుపు పండుగ నేపథ్యంలో సెలవులు మంజూరు చేశారు.
ఇప్పుడు అక్టోబర్ 13వ తేదీ కూడా స్కూళ్లకు సెలవు రానుంది దీంతో మొత్తం వరుసగా ఆరు రోజులు పాటు స్కూళ్లకు సెలవు వస్తుంది. అక్టోబర్ 13వ తేదీ కొన్ని ప్రాంతాల్లో తులసి పూజలు నిర్వహిస్తారు. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత పరమ పవిత్రంగా భావిస్తారు.దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు కూడా స్కూళ్లకు సెలవు మంజూరు చేశారు.
ఇక నవంబర్ 14న జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా జరుపుకునే 'బాలల దినోత్సవం' రానుంది. ఈరోజు కూడా పాఠశాలలకు దేశవ్యాప్తంగా సెలవులు మంజూరు చేస్తారు. ఇక మరుసటి రోజు నవంబర్ 15వ తేదీ 'గురునానక్ జయంతి' సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేస్తారు.
ఇక 16వ తేదీ కూడా శనివారం దీంతో స్కూళ్లకు హాఫ్ డే. నవంబర్ 18 ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు సెలవు వస్తుంది అంతేకాదు ఆరోజు కనకదాస జయంతి కూడా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు సెలవు ప్రకటిస్తారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు ఆరు రోజులు వరుసగా సెలవులు రానున్నాయి. ఇవి స్థానిక విద్యా సంస్థల నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఆ విధంగానే సెలవులు మంజూరు చేస్తారు మరోసారి విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్తా ఇది.
ఇక డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా కొన్ని క్రిస్టియానిటీ స్కూళ్లలో పది రోజులపాటు కూడా సెలవులు మంజూరు చేస్తారు. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఆరోజు ప్రపంచవ్యాప్తంగా సెలవు ఉంటుంది.