Samantha: సమంతను కిడ్నాప్ చేసిన బడా ప్రొడ్యూసర్..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన.. వారిలో హీరోయిన్ సమంత కూడా ఒకరు.. ఒకానొక సమయంలో సమంత లక్కీ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో.. జోడిగా నటించిన సమంత.. బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంది. కానీ ఇటీవల కాలంలో సమంత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల.. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఇప్పుడు సమంతకి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.
సమంతాను ఒక బడా ప్రొడ్యూసర్ కిడ్నాప్ చేశారనే వార్తలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం రామయ్య వస్తావయ్య. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా.. శృతిహాసన్ కూడా మరొక పాత్రలో నటించింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇండస్ట్రీకి చెందిన ఒక బడా ప్రొడ్యూసర్.. సమంతను కిడ్నాప్ చేయించారని, తనని తన ఫామ్ హౌస్ లో కొద్దిరోజులు బంధించారని వార్తలు వినిపించాయి.
అయితే సమంతను అలా బంధించడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే.. సమంత టాలీవుడ్ లో ఉండే బడా నిర్మాణ సంస్థలు అన్నిటిలో కూడా నటించిందట. కానీ ఆయన సినిమాలకు మాత్రం నో చెబుతూ ఉండడంతో ఈ పని చేసినట్లు అప్పట్లో కొన్ని రూమర్స్ నడిచాయి. మరి సమంతను ఆ బడా ప్రొడ్యూసర్ కిడ్నాప్ చేశారనే వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. మొత్తానికి ఇప్పుడు మళ్లీ మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది.
అంతేకాకుండా ఆ కిడ్నాప్ చేసిన ప్రొడ్యూసర్ కొడుకు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరో అన్నట్లుగా తెలుస్తోంది. ఇక అప్పట్లో సమంత కొంత మేరకు గ్యాప్ ఇవ్వడంతో ఈ రూమర్స్ నిజమే అనే విధంగా పలువురు నెటిజెన్స్ భావిస్తున్నారు.