Alpha Hotel Closed: హైదరాబాద్‌వాసులకు భారీ షాక్.. ప్రముఖ బిర్యానీ హోటల్ బంద్

Fri, 23 Aug 2024-11:04 pm,

Alpha Hotel: హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇరానీ హోటళ్లలోనే తినాలి. అసలైన హైదరాబాద్‌ బిర్యానీ ఇరానీ హోటళ్లలో మాత్రమే లభిస్తుంది.

Alpha Hotel: మహానగరంలో చాలా ఇరానీ హోటళ్లు ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైనది ఆల్ఫా హోటల్‌.

Alpha Hotel: ఎన్నో దశాబ్దాలుగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉండే ఆల్ఫా హోటల్‌ నిత్యం కిక్కిరిసి ఉంటుంది.

Alpha Hotel: ఛాయ్‌, బిస్కెట్‌, బిర్యానీ, బేకరీ ఐటమ్స్‌కు ఆల్ఫా హోటల్‌ ప్రాచుర్యం పొందింది.

Alpha Hotel: చారిత్రక హోటల్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ప్రమాదం సంభవించడంతో హోటల్‌ కాలిపోయింది.

Alpha Hotel: ప్రమాదం సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Alpha Hotel: ప్రమాదంతో హోటల్‌ తీవ్రంగా దెబ్బతింది. హోటల్‌లోని ఫర్నీచర్‌, వస్తువులు కాలిపోయాయి.

Alpha Hotel: అగ్నిప్రమాదంతో హోటల్‌ను బాగు చేసేందుకు కొన్ని నెలలు సమయం పట్టనుంది. దీంతో కొన్ని రోజులు హోటల్‌ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

Alpha Hotel: అధిక రద్దీతో ఆల్ఫా హోటల్‌ ఇరుకుగా మారింది. దీంతో హోటల్‌ను పునఃనిర్మించే యోచనలో నిర్వాహకులు ఉన్నారు. ఈ కారణంగా కొన్ని నెలల పాటు హోటల్‌ మూత పడనుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link