Reliance Jio: జియో యూజర్లకు మరో షాక్‌.. ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో రీఛార్జీ ప్లాన్‌ను రూ. 300 పెంచిన జియో..

Thu, 29 Aug 2024-11:07 am,

రిలయన్స్ జియో ఓ రెండు రీఛార్జీ ప్లాన్ల ధరలను పెంచేసింది. ఇందులో కంప్లిమెంటరీగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రీప్షన్‌ ఉచితంగా పొందుతారు.  

జియో అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ల వివరాల ప్రకారం జియో తన రీఛార్జీ ప్లాన్‌ ధరలను ఏకంగా రూ.200 నుంచి రూ. 300 పెంచేసింది. ఈ ప్లాన్‌లో అదనంగా ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందించనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.  

రిలయన్స్‌ జియో రూ.1,099 రీఛార్జ్‌ ప్లాన్‌.. మొదట రూ. 1,099 ఉన్న రీఛార్జీ ప్లాన్లు తాజాగా రూ.1,299 కు పెంచింది. ఇందులో మీరు రూ. 149 ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రీప్షన్‌ పొందుతారు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు, ప్రతిరోజూ 2 GB డేటా పొందుతారు. ఇందులో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు.

రిలయన్స్ జియో రూ. 1,499 రీఛార్జీ ప్లాన్‌.. ఈ ప్లాన్‌ ధరను రూ 1,799 కు పెంచేసింది జియో ఇందులో మీరు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌స్క్రీప్షన్‌ పొందుతారు. ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు ప్రతిరోజూ 3 GB డేటా కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో కూడా ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సౌకర్యం ఉంటుంది.

జులై 3 నుంచి ప్రధాన టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌లను సవరించాయి. ఆ తర్వాత తమ ప్లాన్‌లకు అనుగుణంగా తాజా టారిఫ్ పెంపుదలకు తీసుకువచ్చింది జియో. రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్‌లను 12-27 శాతం మధ్య పెంచుతుందని ప్రకటించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link