TGSRTC Strike: ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్

Mon, 27 Jan 2025-12:04 pm,
Telangana RTC Strike

కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండడం చర్చనీయాంశమవుతోంది.       

Telangana RTC

నేడు బస్ భవన్‌కు కార్మిక, శ్రామిక, ఉద్యోగుల్లారా భారీసంఖ్యలో తరలిరాలని RTC-JAC కోరారు. గత BRS ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించగా.. మరోసారి సమ్మె బాట పట్టనుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు.  

Telangana Buses

ఓ వైపు ప్రైవేటు పరం లేదంటునే.. ఎలక్ట్రిక్ బస్సులను తెస్తూ డ్రైవర్లకు తిప్పలు పెడుతున్నారని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఫైర్ అవుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు కదిలి వచ్చి.. కార్మికుల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.  

సర్వీసుల్లో ఉన్నవారి సమస్యలే కాదు.. రిటైర్డ్ అయిన వారి సమస్యలు ఇంకా తీరనే లేదన్నారు. పెండింగ్‌ బకాయిలు, అడుగుపడని పే స్కేళ్లు, చెల్లించని సీసీఎస్‌ బకాయిలు, డీఏ బకాయిలు, యూనియన్ల ఏర్పాటు, ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాల సవరణ తదితర హామీల అమలు కోసం సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు.  

సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బస్ భవన్‌లో సమ్మె నోటీసు అందజేయనున్నారు. భారీ సంఖ్యలో కార్మిక, శ్రామిక, ఉద్యోగులందరూ తరలిరావాలని జేఏసీ కోరారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link