Tabu: 52 ఏళ్ల వయస్సులో పెళ్లి.. షాకింగ్ నిజo రివీల్ చేసిన నటి ?.. అసలూ రూమర్స్‌కు కారణం అదా..?
సీనియర్ నటి టబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదుపదుల వయస్సు దాటిన కూడా ఇప్పటికి కూడా నేటి తరం హీరోయిన్లకు ఏమాత్రం తగ్గిపోని విధంగా గ్లామర్ ను మెంటైన్ చేస్తుందని చెప్పుకొవచ్చు.
ఇదిలా ఉండగా..కూలీ నెం.1 మూవీతో తెలుగులో నటించే చాన్స్ కొట్టేసిన ఈ భామ..అతి తక్కువ సమయంలోనే ఫెమస్ తెలుగు హీరోల సరసన నటించింది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్, నాగార్జున, బాలయ్య లకు జోడిగా నటించింది.
నాగార్జునతో నిన్నే పెళ్లడతా, ఆవిడ మా ఆవిడ లాంటి సినిమాల్లో నటించి తనదైన నటనతో తెలుగులో స్టార్ డమ్ కొట్టేశారు. బాలయ్యతో.. చెన్నకేశవ రెడ్డి, పాండురంగడు వంటి సినిమాల్లో నటించారు. ప్రేమదేశం మూవీ ఆమె కెరిర్ లో అదిరిపోయే హిట్ అని చెప్పవచ్చు.
ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురం మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తల్లి పాత్రలో నటించారు. అంతే కాకుండా..దృశ్యం 2, నూటబల్ బాయ్ వంటి మూవీస్ లో కూడా నటించారు.
గతంలో పలు ఇంటర్వ్యూలలో మూవీలో పాత్రకు అవసరమైతే.. రొమాన్స్ చేసేందుకు రెడీ.. అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే.. టబు.. గతంలో నాగార్జున, హింది నటుడు అజన్ దేవ గణ్ లతో డేటింగ్ చేసిందని, వీరి మధ్య కొన్నిరోజుల పాటు ప్రేమ వ్యవహారాలను కూడా నడిచాయని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.
తాజాగా, 52 ఏళ్ల వయస్సులో టబు పెళ్లి పీటలెక్కబోతున్నారని, అతి కూడా బాలీవుడ్ హీరో తో అని వార్తలు వైరల్ గా మారాయి. ఇటీవల టబు ఒక బాలీవుడ్ హీరోను కలిశారంట. అందుకే ఇలా పుకార్లు వచ్చినట్లు సమాచారం. దీనిపై నటి టబు సన్నిహితులు స్పందించారని, ఈ రూమర్స్ లలో నిజంలేదని కూడా కొట్టిపారేసినట్లు కూడా మరల ప్రచారం జరుగుతుంది. అయితే.. దీనిపైన కూడా నటి టబు మాత్రం అఫిషియల్గా స్పందిస్తేనే ఈ రూమర్స్ వ్యాప్తికి చెక్ పడుతుందని చెప్పుకొవచ్చు.