Aadhar Card: ఆధార్ ఉన్నవారికి బిగ్ అలెర్ట్.. ఇలా చేశారంటే మీ కార్డు ఎప్పటికీ పనిచేయదని యూఐడీఏఐ వార్నింగ్..!!
నేటి వరకు ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి ఉచిత అవకాశం కల్పించిన యూఐడీఏఐ, తాజాగా వినియోగదారులకు మరో వార్నింగ్ ఇచ్చింది. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యం. ఏ లావాదేవీలు చేయాలన్నా ఆధార్ తప్పనిసరి, ఇది భారతీయులకు ఓ డిజిటల్ గుర్తింపు. ఏ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా, విద్యాసంస్థలు, ఆరోగ్యం ప్రతి ప్రభుత్వ పథకానికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి.
అయితే, ఆధార్ కార్డు ట్యాంపర్ అవుతే చట్టపరమైన సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆధార్ బయోమెట్రిక్ కలిగి ఉంటుంది. ఆధార్ కార్డును ట్యాంపర్ చేయకూడదని యూఐడీఏఐ ఆదేశించింది. ఆధార్ ఉపయోగించే ముందు వెరిఫికేషన్‌కు ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
ఎం ఆధార్ యాప్, ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ కోసం స్కాన్ చేస్తారు. ఈ క్యూఆర్ కోడ్‌తో ఏదైనా ట్యాంపరింగ్ జరిగితే మీ కార్డు ఎప్పటికీ పనిచేయదని అందుకే భద్రంగా ఉపయోగించాలని యూఐడీఏఐ చెప్పింది.
ఇదిలా ఉండగా ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి ఈరోజు వరకు అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నామమాత్రపు ఫీజు ఆధార్ కార్డు అప్డేట్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డు వినియోగదారులు తమ కార్డును తప్పనసరిగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆధార్ కార్డు యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా నేరుగా ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.
మీ ఆధార్ కార్డులోని మార్పులు చేసే అవకాశం ఆధార్ కల్పించింది. ఇందులో మీ పేరు, అడ్రస్, పుట్టినరోజులో మార్పులు చేసుకోవచ్చు. యూఐడీఏఐ ఈ సర్వీసును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా అందుబాటులో ఉంచింది. డెడ్ లైన్ తర్వాత ప్రతి అప్డేట్‌కు రూ.50 చెల్లించాలి.
అంతేకాదు యూఐడీఏఐ మరో హెచ్చరిక కూడా ఆధార్ కార్డు వినియోగదారులకు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ఆధార్ కార్డుదారుడు తమ ఇతరులకు మీ ఆధార్ వివరాలు కనిపించకుండా బయోమెట్రిక్‌ను లాక్ చేసి పెట్టుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఎక్కడైన ఆధార్ కార్డు వివరాలు షేర్ చేసేటప్పుడు మాస్క్ ఆధార్ కార్డును ఉపయోగించాలని కీలక సూచన చేసింది.